జనవరి నెల ప్రారంభంలో వైయస్ షర్మిల( YS Sharmila ) కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం తెలిసిందే.ఈ క్రమంలో తన వైయస్సార్ టిపి పార్టీని కాంగ్రెస్ లో( Congress Party ) విలీనం చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే మొన్ననే.జనవరి 16వ తారీకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలు షర్మిలకి అప్ప జెప్పడం జరిగింది.
ఆదివారం కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలు షర్మిల స్వీకరించనున్నారు.పీసీసీ అధ్యక్షురాలిగా రేపు బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో వైయస్ షర్మిల నేడు ఇడుపులపాయలో( Idupulapaya ) తండ్రి వైయస్సార్ సమాధి వద్ద ఆమె నివాళులర్పించారు.
ఈ క్రమంలో మాజీ మంత్రి అహ్మదుల్లా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
కాగా రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) ఆశయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో తాను జాయిన్ అయినట్లు వైయస్ షర్మిల స్పష్టం చేశారు.2014లో విభజన జరిగిన తర్వాత.ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది.
ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు.మరోపక్క మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల జాయిన్ కావడం ఆమెకు పీసీసీ బాధ్యత కాంగ్రెస్ పెద్దలు అప్పజెప్పడం జరిగింది.2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ తరపున షర్మిల ప్రచారం నిర్వహించారు.ఇప్పుడు 2024 ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావటం.ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.