ఢిల్లీకి బయలుదేరిన వైఎస్ షర్మిల..!!

YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల( YS Sharmila ) రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.

ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) జాయిన్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.ఇదే సమయంలో తన వైయస్సార్ టిపి పార్టీని.

కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్లు కూడా గత కొద్ది రోజుల నుండి వార్తలు వస్తున్నాయి.ఇదే సమయంలో మంగళవారం ఇడుపులపాయలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి తనకు ఇబ్బంది ఏమీ లేదని కూడా షర్మిల వ్యాఖ్యానించారు.

కాగా బుధవారం తల్లి విజయమ్మ( Vijayamma ) తనకి కాబోయే కోడలు మరియు కొడుకుతో కలిసి షర్మిల తాడేపల్లిలో అన్న వైయస్ జగన్( YS Jagan ) వదిన భారతి లకు శుభలేఖ అందించి పెళ్లికి ఆహ్వానించడం జరిగింది.తన సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ నీ కలిసినా అనంతరం షర్మిల గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ( Delhi ) పయనం కావడం జరిగింది.రేపు ఢిల్లీలో షర్మిల కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారు.

Advertisement

పార్టీలో చేరిక ఇంకా పదవులపై చర్చలు జరపనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం ఎఐసీసీ పదవితోపాటు.

ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ బాధ్యతలు హస్తినా పెద్దలు షర్మిలకి అప్పజెప్పబోతున్నట్లు టాక్.

Advertisement

తాజా వార్తలు