వైరస్ అంటూ... ఆయనపై షర్మిల ఫైర్

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పై( CM KCR ) వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ( YS Sharmila ) తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

గత కొంతకాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ను( BRS ) పూర్తిగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న షర్మిల ప్రతి అంశం పైన స్పందిస్తూ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం పైన, కెసిఆర్ పైన తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.

తాజాగా మరోసారి అదే తరహాలో కెసిఆర్ పై షర్మిల సెటైర్లు వేశారు.కరోనా కంటే మించిన వైరస్ లు వస్తాయి అంటూ కేసిఆర్ జోస్యం చెబుతున్నారని,

తెలంగాణ సమాజాన్ని పట్టిపీడించే మీకంటే పెద్ద వైరస్ ఏది రాదులే అంటూ షర్మిల సెటైర్లు వేశారు.మీ దరిద్రపు పాలనే తెలంగాణ ప్రజలను పట్టిపీడించే అతిపెద్ద వైరస్ అని షర్మిల విమర్శించారు.రాష్ట్ర ఖజానా ఖాళీ చేయడానికి పుట్టిన మహమ్మారి పాలన మీది అంటూ విమర్శించారు.

ప్రజలను అప్పులపాలు చేయడానికి పట్టుకున్న వైరస్ మీరు అంటూ షర్మిల విమర్శించారు.కరోనాతో పోరాడి నిలిచేమో కానీ, బీఆర్ఎస్ వైరస్ కంటపడితే కేల్ ఖతం దుకాణం బంద్ అంటూ షర్మిల విమర్శించారు.

Advertisement

తెలంగాణలో వైద్యాన్ని ఉద్ధరించినట్లు ఉత్తర మాటలు చెప్పే దొర, నిమ్స్ విస్తరణకు కొబ్బరికాయ కొట్టారు సరే, గత శంకుస్థాపన సంగతి ఏంటో జర చెప్పాలని సెటైర్లు వేశారు.1500 కోట్లతో ఉస్మానియా దవాఖానలో కడతామని చెప్పిన ట్వీన్ టవర్స్ ఎక్కడ అంటూ షర్మిల ప్రశ్నించారు.నగరం నలుమూలల నాలుగు పెద్దాసుపత్రులు ఎక్కడ అని ప్రశ్నించారు.

అక్కడ కార్పొరేట్ వైద్యం ను మించిన ట్రీట్మెంట్ ఏమైందని అన్నారు.కొబ్బరికాయ కొట్టి 14 నెలలైనా, పునాది రాయి పడలేదని, దొర విలాసాలకు కొత్త సచివాలయం మీద పెట్టిన శ్రద్ధ, ప్రజల ఆరోగ్యం మీద లేదని విమర్శించారు.

కమిషన్లకు కాళేశ్వరం మీద పెట్టిన దృష్టి వైద్యాభివృద్ధి మీద లేదంటూ షర్మిల విమర్శలు చేసారు.

ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...
Advertisement

తాజా వార్తలు