ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఒక్కసారిగా ముందస్తు ఎన్నికల చర్చ మొదలైంది.జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి హై కమాండ్ ను కలిసినప్పటి నుండి రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది.
ప్రధాన మోదీ వద్ద జగన్ నేరుగా ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం.ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముందు కేంద్రం సహకారం కోరాడట మన వైసీపీ అధినేత.
కానీ మోదీ మాత్రం ముక్తసరిగా సమాధానం ఇవ్వడం ఇప్పుడు జగన్ ను మరింత ఆలోచనలోకి నెట్టేసింది.అయితే ఇప్పుడు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
ముందు నుండి తాము ముందస్తు ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళమని… తమ పాలనపై తమకు నమ్మకం ఉందని వైసిపి మంత్రులు ఎమ్మెల్యేలు తెగ బీరాలు పలికారు.కానీ ఇప్పుడు మాత్రం ప్రజల వద్ద నుండి వస్తున్న వ్యతిరేకత వారికి మెల్లగా అర్థం అవుతోంది.
గడప గడప నుండి వస్తున్న నిరసనలు ఎమ్మెల్యేలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి.
అటుపక్క లోకల్ నేతల్లో కూడా జగన్ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది.
పైగా ఎన్నికలు దగ్గర పడే కొద్దిమంది పార్టీలో నేతలు అటు ఇటు మారే అవకాశాలు కూడా ఉన్నాయి.చంద్రబాబు సభలు పెట్టేస్తున్నాడు… జనాల్లోకి వెళ్లిపోతున్నాడు.కానీ ముందస్తు ఎన్నికల విషయమై ఇక్కడ ఒక పెద్ద చిక్కు ఉంది.ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే ఎలక్షన్ కమిషన్ సహకరించాలి.
అందుకు ఢిల్లీలోని పెద్దలు చాలా కీలక పాత్ర పోషిస్తారు.వీటన్నింటి కంటే ముందు గవర్నర్ ను అసెంబ్లీ రద్దుకు సిఫారస్ చేయాలని కోరాలి.
ఆ సమయంలో కేంద్రం కాని అడ్డం తిరిగితే జగన్ మధ్యలో లాక్ అయిపోతాడు.

అప్పుడు వెంటనే అసెంబ్లీ రద్దయి రాష్ట్రపతి పాలన విధించి ఆరు నెలలు జాప్యం చేసి అధికార పార్టీని రాష్ట్రంలో చిన్నాభిన్నం చేసే అధికారం కేంద్రానికి ఉంది.క్రితం సారి చంద్రబాబు ఇలాగే ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఎలక్షన్ కమిషన్ అడ్డుపడింది.ఆ తర్వాత టిడిపి కి జరిగిన తీవ్ర పరిణామాలు అందరికీ తెలిసిందే.అయితే జగన్ పూర్తిగా వణికిపోలేదు కానీ కొద్దిగా భయపడినట్లు స్పష్టంగా కనబడుతోంది.ఉద్యోగులకు జీతాలు, లబ్దిదారులకు పెన్షన్లు టైం కు అందట్లేదు.ఖజానా ఖాళీ అయిపోయింది.
ఇవన్నీ ఓట్ల రూపంలో ప్రభావం చూపించక ముందే ఎన్నికలు జరిపించడం బెటర్ అని జగన్ ఆలోచన అంటున్నారు.







