పవన్ టార్గెట్ చేసిన ఎమ్మెల్యేని జగన్ అందలం ఎక్కించనున్నారా ?

ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు.

ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలు,మరోవైపు తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలు హడావిడి మొదలు కావడంతో, పవన్ సినిమాలని కాసేపు పక్కనబెట్టి ఏపీలో అడుగుపెట్టారు.

తాజాగా తిరుపతి పార్లమెంట్ స్థానంలోని జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యి, ఎన్నికల్లో పోటీ చేసే విషయం, బీజేపీతో పొత్తు విషయంపై చర్చించారు.ఇదే క్రమంలో శనివారం ఒంగోలుకు వచ్చిన పవన్, గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యేని గట్టిగా టార్గెట్ చేశారు.

ఇటీవల రాంబాబుని జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు స్థానిక సమస్యలపై ప్రశ్నించారు.అయితే ఎమ్మెల్యేని ప్రశ్నించిన రెండురోజులకే వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నారు.

ఎమ్మెల్యే అనుచరులు, వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేకే వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నారని పవన్ మండిపడుతున్నారు.దాష్టీకాలు ఎక్కువవుతుంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని, అన్నా రాంబాబుని అద:పాతాళానికి తొక్కేస్తామని హెచ్చరించారు. పవన్ హెచ్చరికలపై వైసీపీ నేతలుగానీ, ఎమ్మెల్యే అన్నా రాంబాబు గానీ పెద్దగా స్పందించడం లేదు.అయితే రాష్ట్రంలో జగన్ తర్వాత భారీ మెజారిటీతో గెలిచింది రాంబాబునే.2019 ఎన్నికల్లో రాంబాబు దాదాపు 80 వేల పైనే మెజారిటీతో గెలిచారు.

Pawan Kalyan Targets Giddalur Ycp Mla Anna Rambabu, Ys Jagan, Pawan Kalyan, Ycp
Advertisement
Pawan Kalyan Targets Giddalur YCP MLA Anna Rambabu, YS Jagan, Pawan Kalyan, YCP

ఇదే రాంబాబు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి గెలవగా, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.ఇప్పుడు వైసీపీ నుంచి గెలిచిన రాంబాబుకు మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉందని కూడా ప్రచారం జరుగుతుంది.నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో జగన్, రాంబాబుకు అవకాశం ఇవ్వొచ్చని రాజకీయ పరిశీలకులు మాట్లాడుకుంటున్నారు.

ఎందుకంటే వైశ్య సామాజికవర్గం నుంచి ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నారు.నెక్స్ట్ ఈయన సీటు డౌటే అంటున్నారు.

ఈయన స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామికి గానీ, అన్నా రాంబాబుకు గానీ పదవి దక్కొచ్చని ప్రచారం జరుగుతుంది.మరి చూడాలి పవన్ టార్గెట్ చేసిన ఎమ్మెల్యేని జగన్ అందలం ఎక్కిస్తారో లేదో.

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!
Advertisement

తాజా వార్తలు