Memantha Siddham Bus Yatra : నేటి నుంచే ‘ మేమంతా సిద్ధం ‘ .. జగన్ షెడ్యూల్ ఇలా

ఇడుపులపాయ( Edupulapaya ) నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు ‘ మేమంతా సిద్ధం ‘ యాత్రను నిర్వహించేందుకు షెడ్యూల్ ను రూపొందించారు.ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు ‘మేమంతా సిద్ధం ‘ పేరుతో వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్  బస్సు యాత్ర చేపట్టనున్నారు.

 Memantha Siddham Bus Yatra : నేటి నుంచే ‘ మేమం-TeluguStop.com

కొద్దిరోజుల క్రితం నిర్వహించిన సిద్ధం సభలు జరిగిన భీమిలి,  దెందులూరు, రాప్తాడు,  మేదరమెట్ల ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలు  మినహా అన్ని జిల్లాల్లో నూ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా జనాల్లోకి జగన్ వెళ్ళనున్నారు.పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభలో జగన్ మాట్లాడే విధంగా షెడ్యూల్ రూపొందించారు.

రోజుకొక పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర కొనసాగనుంది.తొలి రోజు బస్సు యాత్రను కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధి నుంచి ప్రారంభించనున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Ichhapuram, Idupulapaya, Jagan, Memanthasid

తొలి రోజు యాత్ర షెడ్యూల్ .జగన్( CM jagan) ఈరోజు ఉదయం తాడేపల్లిలోని నివాస నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయకు చేరుకుంటారు .దివంగత రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు.మధ్యాహ్నం 1.30 గంటలకు ‘మేమంతా సిద్ధం( Memantha Siddham ) ‘ బస్సు యాత్రను జగన్ ప్రారంభిస్తారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Ichhapuram, Idupulapaya, Jagan, Memanthasid

ఇడుపులపాయ నుంచి కుమారుని పల్లి,  వేంపల్లి,  సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి, గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, ఎర్రగుంట్ల, పోట్ల దుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకు ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు.అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

అనంతరం సన్నపు రాళ్లపల్లి , దువ్వూరు జిల్లా నాగులపాడు ,బోధనం , రాం పల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు.ఈ యాత్ర ద్వారా వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెంపొందించడం తో పాటు, జనాల్లోనూ వైసీపీ( YCP ) కి మరింత ఆదరణ పెంచేందుకు ఈ బస్సు యాత్రను మొదలుపెట్టనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube