Ys jagan balakrishna: కృష్ణ చివరి చూపుల్లో బాలయ్యను పలకరించిన వైఎస్ జగన్.. వైరల్ న్యూస్!

కొన్ని కొన్ని సమయాలలో ఎంత పడని వ్యక్తి అయినా కానీ సందర్భం బట్టి పలకరించాల్సి వస్తుంది.ఎంత పెద్ద శత్రువులు అయినా సరే సందర్భం వస్తే మాత్రం పలకరించకుండా ఉండలేరు.

 Ys Jagan Greets Balayya In Hero Krishna Last Rituals Details, Ys Jagan ,balayya-TeluguStop.com

ఇటువంటి సందర్భాలు సామాన్యులకే కాదు పెద్ద పెద్ద రంగాలకు చెందిన వాళ్లకు కూడా ఎదురవుతూ ఉంటాయి.పదిమందిలో ఉన్నప్పుడు తమకు పడని వ్యక్తులను పలకరించకపోతే తమకు, వారికి తేడా ఉండదు అన్నట్లుగా పలకరించుకుంటూ పోతారు.

అయితే తాజాగా ఇటువంటి సంఘటన వైఎస్ జగన్, బాలయ్య మధ్య ఎదురయింది.ఇంతకు అసలు విషయం ఏంటంటే.సూపర్ స్టార్ కృష్ణ నిన్న ఉదయం ఈ లోకాన్ని విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో తన హీరోయిజంతో సూపర్ స్టార్ గా నిలిచారు కృష్ణ.

ఇక ఈయనే కాకుండా ఈయన వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఇక కొన్ని సంవత్సరాల కిందట సినిమాలకు గుడ్ బై చెప్పి రెస్ట్ తీసుకుంటున్న కృష్ణ గత కొన్ని రోజుల నుండి అనారోగ్య సమస్యతో బాధపడ్డారు.

Telugu Balayya, Krishna Rituals, Jagangreets, Krishna, Mahesh Babu, Krishna Demi

రెండు రోజుల కిందట ఆయనను హాస్పిటల్లో చేర్చగా పరిస్థితి విషమించటంతో నిన్న ఉదయం తెల్లవారుజామున ఈ లోకాన్ని విడిచిపెట్టారు.ఈ విషయం తెలియటంతో రాజకీయ నాయకులు, సిని ప్రముఖులు, ఆయన మిత్రులు, కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయన చివరి చూపులు చూడటానికి తరలివస్తున్నారు.

ఇప్పటికే కృష్ణ ఆఖరి చూపులను చూడటానికి చాలామంది సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా తరలివచ్చారు.ఇక ప్రతి ఒక్కరూ మహేష్ బాబు దగ్గరికి వచ్చి ఆలింగనం చేసుకొని ధైర్యం ఇస్తున్నారు.

అంతేకాకుండా ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శిస్తున్నారు.ఇప్పటికే తన అన్న, తల్లి మరణాలతో కోల్కోని మహేష్ బాబుకు అంతలోనే తండ్రి మరణం ఎదురవటంతో చాలామంది ఆయనను మరింత ధైర్యం ఇస్తూ ఓదార్చుతున్నారు.

Telugu Balayya, Krishna Rituals, Jagangreets, Krishna, Mahesh Babu, Krishna Demi

ఇక ఇదంతా పక్కన పెడితే.ఎప్పటికప్పుడు మీడియా అక్కడ జరుగుతున్న విషయాన్ని లైవ్ ద్వారా కవర్ చేస్తూ ఉంది.ఎవరెవరు వస్తున్నారు అనేది కూడా రికార్డ్ చేసి చూపిస్తుంది.అయితే తాజాగా కృష్ణ చివరి చూపులను చూడటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా వచ్చారు.ఇక అప్పటికే అక్కడికి బాలయ్య కూడా తన ఫ్యామిలీతో వచ్చారు.

కృష్ణకు నివాళులు అర్పించి అక్కడే ఉన్న మహేష్ బాబు దగ్గర మాట్లాడుతూ ఉన్నారు.

అంతలోనే అక్కడికి జగన్ వచ్చి కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించి మహేష్ బాబు దగ్గరికి వచ్చి ఆ లింగనంచేసి పలకరించాడు.వెనుకాలనే ఉన్న రాజకీయ ప్రత్యర్థి బాలయ్యను కూడా పలకరించాడు.

అయితే ప్రస్తుతం ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.వైఎస్ జగన్ బాలయ్యను పలకరించారు అంటూ.

ఎంతైనా రాజకీయపరంగా కాకుండా బయట కలిస్తే వీరి మధ్య ఎటువంటి తేడాలు ఉండవంటూ అందరూ ఒకటే అన్నట్లుగా ఉంటారు అని కొందరు అంటున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube