మానవులు స్వార్థంతో అడవులను నరికివేస్తూ జంతువులకు నివాసం లేకుండా చేస్తున్నారు.అందువల్ల పులులు, సింహాలు ఎలుగుబంట్లు, ఏనుగులు జనావాసాల్లోకి వస్తున్నాయి.
తాజాగా ఒక అడవి ఏనుగు ఒక ఊరిలోకి ప్రవేశించి పంట పొలాల్లోకి అడుగుపెట్టింది.అయితే ఈ ఏనుగుని గమనించిన కొందరు ఆకతాయి వ్యక్తులు దానిని చెప్పులతో బెదిరిస్తూ తరిమేందుకు ట్రై చేశారు.
అంతటితో ఆగకుండా అది వెళ్ళిపోతుంటే రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు.దాంతో ఏనుగుకు కోపం వచ్చి వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది.
అస్సాంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో విస్తృతంగా వైరల్ అవుతోంది.దీనిని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ( IFS ) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
ఈ వీడియోలోని యువకుల ప్రవర్తనను ఉద్దేశించి “ఇక్కడ ఎవరు జంతువులు, రెచ్చగొట్టి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం, ఆపై ఏనుగులను కిల్లర్స్ అని పిలవడం ప్రజలకు అలవాటైపోయింది.” అని పర్వీన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ఒక పెద్ద ఏనుగు( Elephant )ను కొందరు యువకులు చెప్పు చూపిస్తూ భయపెట్టడం మనం చూడవచ్చు.అయితే ఆ ఏనుగు వారిపై దాడి చేయడానికి వచ్చింది.
దాంతో ఒక చిన్న గుంత లాగా ఉన్న ప్రాంతంలోకి యువకులు పరిగెత్తారు.ఆ ఏనుగు ఆ గుంతలోకి దిగలేక యువకులను ఏమీ చేయలేక పోయింది.
తర్వాత తన దారిన తాను వెళ్ళిపోతుంటే వీరు మళ్ళీ దాని వెంటపడి హింసించారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువకుల బిహేవియర్ ను తప్పుబడుతున్నారు.ఇలాంటి పిచ్చి చేష్టలు చేసి చాలామంది ఇప్పటికే ప్రాణాలు పోగొట్టుకున్నారు.వీరికి ఇంకా బుద్ధి రాలేదు అనుకుంటా అని ఒక నెటిజెన్ వ్యాఖ్య చేశారు.
ఈ వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి.