సోషల్ మీడియా అకౌంట్లను ఉపయోగించి ట్రాప్ చేస్తున్న ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఇన్ స్టా, ఫేస్ బుక్ లో ఫోటోస్, వీడియోలు పెట్టి యువతి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.
ప్రేమ, పెళ్లి పేరుతో యువకులను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసింది.ఈ క్రమంలోనే హైదరాబాద్ కు చెందిన యువకుడి దగ్గర రూ.31 లక్షలు కాజేసింది.దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
నిందితురాలు కృష్ణా జిల్లాకు చెందిన పరాస తనుశ్రీని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అందంగా ముస్తాబై వీడియోలను తను శ్రీ అప్ లోడ్ చేయడంతో పాటు సామాజిక మాధ్యమాల్లోని అకౌంట్లలో లైకులు కొట్టిన వారిని ట్రాప్ చేసిందని పోలీసులు నిర్ధారించారు.
తనుశ్రీతో పాటు ఆమె ప్రియుడు శ్రీకాంత్ ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
.






