కండలు పెంచబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. దేవర సినిమాలో ఏకంగా ఇన్ని ప్రత్యేకతలున్నాయా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గతంలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా కోసం కండలు పెంచగా ఆ సినిమాలోని లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.బాక్సాఫీస్ వద్ద అరవింద సమేత వీర రాఘవ 90 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

 Young Tiger Ntr Devara Movie Specities And War2 Role Details Here Goes Viral,ju-TeluguStop.com

ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఈ ఏడాది నవంబర్ సమయానికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుండగా గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది.హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం పని చేస్తున్నారని సమాచారం అందుతోంది.అదే సమయంలో దేవర సినిమా( Devara Movie )లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) కు ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంటుందని ఆ సాంగ్ సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉండనుందని భోగట్టా.

ఈ సినిమాలో ఆరు యాక్షన్ సీన్స్, నాలుగు సాంగ్స్, ఒక మాంటేజ్ సాంగ్ ఉంటాయని ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్2 సినిమాలో నటించనున్నారు.వార్2 సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ కండలు పెంచనున్నారని తెలుస్తోంది.

తారక్ ఈ సినిమాలో ఏజెంట్ తరహా పాత్రలో కనిపించనున్నారని ఈ పాత్రకు సినిమాలో ఎక్కువగానే ప్రాధాన్యత ఉండనుందని సమాచారం.హృతిక్ తో సమానంగా ఈ పాత్ర ఉండనుందని దేవర, వార్2( War 2 ) ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచే అవకాశం ఉండగా మాస్ సినిమాలలో సినిమాలు కొత్త ఒరవడిని సృష్టిస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube