యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( NTR ) వార్2 సినిమాలో 30 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో కనిపించనున్నారనే వార్త నందమూరి అభిమానులకు అస్సలు నచ్చలేదు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్ర నిడివి ఆర్.
ఆర్.ఆర్ లో కొంతమేర తగ్గడమే ఫ్యాన్స్ ను ఎంతగానో బాధపెట్టింది.అయితే వార్2( War2 ) సినిమాలో తారక్ నటించడం వెనుక తారక్ ప్లానింగ్ మరో విధంగా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కొంతమంది కావాలని నెగిటివ్ కామెంట్లు చేసినా నటన విషయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు గట్టి పోటీ ఇచ్చేవాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు.
నందమూరి బ్యాగ్రౌండ్ ఉన్నా సక్సెస్ కావడం కోసం తారక్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు.అయితే వార్2 సినిమాను నిర్మిస్తున్న యశ్ రాజ్ బ్యానర్ నిర్మాతలు( Yash Raj banner ) ఈ సినిమా తర్వాత సోలో హీరోగా తారక్ తో ఒక సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది.

వైరల్ అవుతున్న వార్తలు నిజమైతే మాత్రం బాలీవుడ్ ( Bollywood )ఇండస్ట్రీని సైతం తారక్ ఏలడం ఖాయమని ఇందుకు సంబంధించి సందేహాలు అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాలీవుడ్ ఇండస్ట్రీలో తారక్ ఊహించని స్థాయిలో సక్సెస్ అయితే అభిమానుల ఆనందానికి సైతం అవధులు ఉండవు.కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్న యంగ్ టైగర్ మరింత ఎదగడంతో పాటు మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లోనే ఉన్నా తారక్ డిమాండ్ కు అనుగుణంగా పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.భవిష్యత్తు సినిమాలు తారక్ స్థాయిని మరింత పెంచాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను నెక్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ట్రిపుల్ హ్యాట్రిక్ దిశగా తారక్ అడుగులు పడుతుండటం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.







