ఆంధ్రావాలా గురించి షాకింగ్ విషయం చెప్పిన ఎన్టీఆర్.. 10 రైళ్లు ఏర్పాటు చేశామంటూ?

ప్రతి హీరో సినీ కెరీర్ లో డిజాస్టర్ సినిమాలు ఉంటాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో కూడా డిజాస్టర్ సినిమాలు ఉండగా ఇతర సినిమాలతో పోలిస్తే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోని సినిమాగా ఆంధ్రావాలా నిలిచింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కి భారీ అంచనాలతో 2004 సంవత్సరం జనవరి 1వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ నటించడం ఈ సినిమాకు మైనస్ అయింది.

రక్షిత ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్లలో భాగంగా తారక్ ఆంధ్రావాలా సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఆంధ్రావాలా సినిమా ఆడియో ఫంక్షన్ కు ఏకంగా 10 లక్షల మంది ఫ్యాన్స్ హాజరయ్యారని తారక్ పేర్కొన్నారు.ఈ ఈవెంట్ కు ప్రభుత్వం 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తారక్ తెలిపారు.

Advertisement
Young Tiger Junior Ntr Interesting Comments About Andhawala Movie Details, Ntr A

కపిల్ శర్మ షోలో జూనియర్ ఎన్టీఆర్ ఈవెంట్లకు భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని కపిల్ శర్మ ప్రస్తావించగా తారక్ ఈ విషయాలను వెల్లడించారు.

Young Tiger Junior Ntr Interesting Comments About Andhawala Movie Details, Ntr A

10 లక్షల మంది ఈవెంట్ కు హాజరయ్యారనే విషయాన్ని విని హీరోయిన్ అలియా భట్ అవాక్కయ్యారు.అయితే ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో డిజాస్టర్ గా నిలవడం వల్ల నిర్మాతలకు మాత్రం ఊహించని స్థాయిలో నష్టాలు రావడం గమనార్హం.

Young Tiger Junior Ntr Interesting Comments About Andhawala Movie Details, Ntr A

ఈ సినిమా సాయాజీ షిండే, రాహుల్ దేవ్ కీలక పాత్రల్లో నటించారు.ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ లో కథనంలో జరిగిన పొరపాట్లు ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయి.సింహాద్రి సక్సెస్ తర్వాత తారక్ నటించిన ఆంధ్రావాలా అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది.

ఆంధ్రావాలా సినిమాలో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా రీమేక్ కాగా అక్కడ మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు