బిజీ రోడ్డు మీదకు ఉరికిన బుడ్డోడు.. ఆ తర్వాత షాకింగ్ ఘటన!

తల్లిదండ్రులు తమ చిన్న పిల్లలను ఎప్పుడూ కనిపెడుతుండాలి.ఎందుకంటే వారు ఎక్కడికి వెళ్తారో, ఏ ప్రమాదాల్లో పడతారో వారికే తెలియదు.

 Young Man Saves Kid Running On The Traffic Road Viral Video Details, Viral Video-TeluguStop.com

ముఖ్యంగా రద్దీ రోడ్డుకి దగ్గరలో నివసించేవారు తమ పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు వారిని చూసుకోకపోయినా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు.

అయితే తాజాగా ఒక తల్లి తన బుడ్డోడి పట్ల నిర్లక్ష్యం చేసింది.అతడు ఏం చేస్తున్నాడు అనేది గమనించలేకపోయింది.

దాంతో అతడు చాలా రద్దీగా ఉన్న రహదారి వైపు పరిగెత్తాడు.

ఆ రోడ్డుపై వాహనాలు చాలా వేగంగా దూసుకెళ్తున్నాయి.

మరోవైపు ఆ పిల్లోడు అటువైపే పరిగెత్తుతున్నాడు.అతన్ని ఆపకపోతే డైరెక్ట్‌గా ఏదో ఒక వాహనం ఢీ కొట్టే ప్రమాదం ఉంది.

ఇంతలోనే దీన్ని గమనించిన పరుగు వ్యక్తి ఆ పిల్లోడిని కాపాడేందుకు చాలా వేగంగా స్పందించాడు.అతడు తన ముందున్న అన్ని అడ్డంకులను దాటుకుంటూ పిల్లవాడిని రోడ్డు ఎక్కనివ్వకుండా వెనక్కి లాగేసాడు.

గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో లక్షల వ్యూస్ తో వైరల్ గా మారింది.

ఈ వీడియోలోని దృశ్యాలను చూసి చాలామంది వావ్ అని అంటున్నారు.‘చాలా క్విక్ రియాక్షన్ వల్ల పిల్లోడు బతికిపోయాడు మీరు నిజంగా గ్రేట్’ అని బాగా పొగిడేస్తున్నారు.కొంచెం ఆలస్యమైనా పిల్లవాడు ప్రాణాలు దక్కి ఉండేవి కావని మరికొందరు కామెంట్ పెడుతున్నారు.

రియల్ హీరోస్ అంటే ఇతనే అని ఇంకొందరు అతన్ని పొగుడుతున్నారు.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube