లింగుస్వామి రామ్ మూవీ స్టోరీ లైన్ ఇదేనా..?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలు ఎక్కువగా కోలీవుడ్ లో గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్లకు అవకాశాలను ఇస్తున్నారు.

కోలీవుడ్ దర్శకుల దర్శకత్వంలో నటించడం వల్ల తమిళంలో కూడా గుర్తింపును సొంతం చేసుకోవచ్చని హీరోలు అభిప్రాయపడుతున్నారు.

స్టార్ హీరో రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా యంగ్ హీరో రామ్ లింగుస్వామి చెప్పిన కథకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.అయితే టాలీవుడ్ హీరోలతో లింగుస్వామి సినిమాను తెరకెక్కించాలని చాలా నెలల నుంచి ప్రయత్నాలు చేయగా ఇప్పటికి గ్రీన్ సిగ్నల్ లభించింది.

అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా చేయాలని లింగుస్వామి గతంలో ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే.అయితే లింగుస్వామి నితిన్ కు చెప్పిన లైన్ నే రామ్ కు చెప్పి స్క్రిప్ట్ ను ఓకే చేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా స్క్రిప్ట్ లైన్ ఒక్కడు తరహాలో ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

వైరల్ అవుతున్న వార్త ప్రకారం హీరోయిన్ కు విలువైన స్థలం ఉంటుందని ఆ స్థలాన్ని విలన్లు కబ్జా చేస్తే హీరో వెళ్లి హీరోయిన్ కు సాయం చేస్తారని తెలుస్తోంది.అయితే రొటీన్ లైన్ అయినా లింగు స్వామి తన స్టైల్ లో సినిమాను తెరకెక్కించి సక్సెస్ సాధించాలని భావిస్తున్నారని భోగట్టా.లింగుస్వామి ఇదే కథతో రామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

రామ్ లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా హిట్ అయితే మాత్రం తెలుగులో లింగుస్వామికి మరి కొందరు హీరోలు ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉంది.లింగుస్వామి నితిన్ కు కథ చెప్పిన తర్వాత పెద్ద మొత్తంలో అడ్వాన్స్ అడగటంతో నితిన్ లింగుస్వామి కాంబో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది.టాలీవుడ్ లో సినిమాలు తెరకెక్కించి సత్తా చాటాలని లింగుస్వామి భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు