పవన్ ను కలిసిన యంగ్ నటుడు.. ఆ ఆనందాన్ని ఇలా తెలిపాడుగా..

పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారో తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు.

ఈయన మ్యానరిజం, ఆటిట్యూడ్ అంటే ఇష్టపడే వారు చాలా మంది.

ఈయనని దేవుడిగా కొలుస్తూ ఆయన అంటే ఎనలేని అభిమానం చూపిస్తూ ఉంటారు.కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు.

సెలెబ్రెటీలకు కూడా పవన్ ఫీవర్ ఉంటుంది.ఆయనను కలిస్తే చాలు ఆ ఎగ్జైట్ మెంట్ మొత్తం చూపిస్తూ ఉంటారు.

మరి తాజాగా ఒక యంగ్ నటుడు అలానే చేసాడు.ఆయన పవన్ ను కలవడంతో తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచు కున్నాడు.

Advertisement

ఆ నటుడు మరెవరో కాదు.పెళ్లి చూపులు, జాతి రత్నాలు వంటి సినిమాల్లో తన అంద్భుతమైన నటన, టైమింగ్ తో మెప్పించిన నటుడు ప్రియదర్శి.

ఈయన తాజాగా పవన్ కళ్యాణ్ ను కలవడంతో ఆ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.ఎప్పిటిలాగానే సారధి స్టూడియోస్ కి షూటింగ్ కోసం వెళ్ళాను.

కానీ ఈ రోజు మాత్రం ఎప్పటిలా లేదు.ఎటు చుసిన హడావుడి.

ఏదో సందడి వాతావరణం కనిపించింది.అందరి నోటా ఒకటే మాట.పవన్ కళ్యాణ్ వస్తున్నారు.అంతే.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం

వారితో ఒక మాటైనా మాట్లాడాలి.వారు తీసిన జానీ సినిమా ఎంతగా నచ్చిందో చెప్పడానికి నేను కూడా రోజంతా ఎదురు చూసాను.

Advertisement

హరీష్ శంకర్ అన్న వల్ల ఆ కోరిక తీరింది.నీకు ప్రత్యేక థాంక్స్ అన్న.పవన్ కళ్యాణ్ గారిని కలవడం.

ఆయనతో మాట్లాడడం ఒక మరిచి పోలేని అనుభూతి.అంటూ అయన ఆనందాన్ని మొత్తం సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో షేర్ చేస్తూ ఈ వార్త ను చాలా ఎగ్జైట్మెంట్ తో తెలిపాడు.ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి.

మరి పవన్ క్రేజ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే.

తాజా వార్తలు