ఈ యువతి దేశభక్తిని ఎంత చక్కగా చాటుతుందో చూస్తే ఫిదా అవుతారు..!

మన దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చి 75వ ఏళ్లు అవుతున్న సందర్భంగా స్వాతంత్ర్య వేడుకలు ఆగస్టు ఒకటో తారీకు నుంచే మొదలయ్యాయి.హర్ ఘర్ తిరంగా పేరిట తీసుకు వచ్చిన కార్యక్రమంలో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

 You Will Be Amazed To See How Well This Young Lady Shows Her Patriotism, Women,-TeluguStop.com

తమ ఇంటిపై జెండాలు ఎగుర వేస్తున్నారు. కొందరు తమ వాహనాలకు భారత త్రివర్ణ పతాకాన్ని కట్టి రెపరెపలాడిస్తున్నారు.

ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ చూసినా త్రివర్ణ జెండాలు కనిపిస్తూ ప్రజలలో ఉన్న దేశభక్తికి ప్రతీకగా నిలుస్తున్నాయి.

చాలామంది భారతీయులు తమ దేశం పట్ల తమకున్న భక్తిని చాటుకుంటూ త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తూ వాటికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఒక యువతి దేశభక్తిని చాటిన విధానం ఇప్పుడు ఎంతో మందిని ఆకట్టుకుంటోంది.దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

ఇది చూసిన నెటిజన్లు యువర్ సూపర్, మేడమ్.చాలా బాగా జెండాని ప్రదర్శించారని కామెంట్ చేస్తారు.

వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే.ఒక యువతి సైకిల్ తొక్కుతూ కనిపించడం చూడవచ్చు.అలానే ఫనా సినిమాలోని దేశ్ రంగీలా రంగీలా అనే పాట కూడా ప్లే అవుతుండటం వినొచ్చు.అయితే ఈ యువతి వైట్ డ్రెస్ ధరించి కాషాయం, ఆకుపచ్చ రంగుల గల చున్నీ వేసుకుంది.

దీంతో ఆమె డ్రెస్ ఒక త్రివర్ణపతాకాన్ని పోలి అద్భుతంగా కనిపించింది.అలాగే సైకిల్ హ్యాండిల్ వదిలేసి తొక్కుతూనే ఆమె దేశ్ రంగీలా రంగీలా పాటకు చక్కగా నాట్యం చేసింది.

ఆ తర్వాత భారత త్రివర్ణ పతాకాన్ని తీసి దానిని గాలికి రెపరెపలాడిస్తూ ఆకట్టుకుంది.ఈ దృశ్యాలను ఆమెకు ముందే బైక్ పై వెళ్తున్న మరొకరు వీడియో తీశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ అద్భుతమైన వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube