టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సుమ కనకాల ( Suma Kanakala ) దంపతులు ఒకరు.ఈమె యాంకర్ గా రాజీవ్ కనకాల( Rajeev Kanakala ) నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
మిగతా హాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మహేష్ బాబు సినిమాల పరంగా ఎంతో మంచి సక్సెస్ అవ్వడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.
అయితే తాజాగా సుమ రాజీవ్ దంపతులు మహేష్( Mahesh Babu )నమ్రత( Namrata ) దంపతులకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.వీరిద్దరి విషయంలో ఓ కామన్ పాయింట్ ఉందంటూ ఓవార్త వైరల్ అవుతుంది.

సుమ బుల్లితెరపై తన కెరియర్ ప్రారంభించి అనంతరం నటుడు రాజీవ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇలా వీరి వివాహం 1999 ఫిబ్రవరి 10వ తేదీ జరిగింది.వీరి వివాహం జరిగి పాతిక సంవత్సరాలు పూర్తి కావడంతో సుమ సోషల్ మీడియా వేదికగా తన భర్తతో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ.ఒకటిగా పాతికేళ్ళు అంటూ రాజీవ్ తో ఉన్న ఫొటో షేర్ చేశారు.
ఇక ఫిబ్రవరి 10వ తేదీ మహేష్ బాబు నమ్రతల వివాహం కూడా జరిగింది.

వీరి వివాహం2005 ఫిబ్రవరి 10న జరిగింది.వీరిద్దరిది కూడా ప్రేమ వివాహమే.వంశీ సినిమా( Vamsi movie )లు మహేష్ బాబు నమ్రత ఇద్దరు కలిసి నటించారు ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
ఇక వీరి వివాహం 2005 ఫిబ్రవరి 10వ తేదీ ముంబైలోని ఒక హోటల్లో చాలా సింపుల్ గా జరిగింది.ఇక వీరి వైవాహిక జీవితం 19 సంవత్సరాల పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో మహేష్ బాబు తన భార్యకు సోషల్ మీడియా వేదికగా ప్రేమ, నవ్వుల్లో, జీవితంలో ఎన్నో అందమైన మూమెంట్స్ లో మనిద్దరం పార్ట్నర్స్.
హ్యాపీ యానివర్సరీ అంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.
.