నాని కొడుకు అర్జున్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా?

నాచురల్ స్టార్ నాని( Nani ).త్వరలోనే హాయ్ నాన్న ( Hai Naana ).

సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.డిసెంబర్ 7వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి నాని తన సినిమా గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.తాజాగా కాలేజి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయినటువంటి నాని వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఇక నానికి అర్జున్ ( Arjun ) అనే కుమారుడు ఉన్న సంగతి మనకు తెలిసిందే.గత కొద్ది రోజుల క్రితం ఈయన తన కుమారుడు అర్జున్ తో కలిసి నాటు నాటు పాటుకు స్టెప్పులు వేస్తూ ఉన్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే ఓ స్టూడెంట్ నానిని ప్రశ్నిస్తూ మీ కుమారు అర్జున్ విషయంలో మీకు అనిపించిన బెస్ట్ మూమెంట్ ఏంటి అంటూ ప్రశ్నించారు.

Advertisement

ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ.మొన్న ఒక రోజు మా బాబుతో మాట్లాడుతూ నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటూ తనని అడిగాను.

ఇలా నీ ఫేవరెట్ హీరో ఎవరని అడగడంతో వెంటనే వాడు నువ్వే నా ఫేవరెట్ హీరో నాన్న అంటూ నా పేరు చెప్పడం చాలా హ్యాపీగా అనిపించిందని, వాడికి ఏ హీరో సినిమాలు ఏంటి అనే విషయాలు గురించి తెలియకపోయినా నువ్వే నా ఫేవరెట్ హీరో అని చెప్పడం చాలా బెస్ట్ మూమెంట్ అనిపించింది అంటూ ఈ సందర్భంగా నాని చెప్పినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.హాయ్ నాన్న సినిమా తండ్రి కూతురు నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇందులో నానికి జోడిగా మృణాల్( Mrunal )జంటగా నటిస్తున్నారు.

దసరా వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నాని ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?
Advertisement

తాజా వార్తలు