వైరల్: నువ్వా.. నేనా.. అంటున్న అడవిదున్న, ఏనుగు.. చివరికి..?!

సోషల్ మీడియా కారణంతో ప్రపంచంలో ఏ మూల ఆసక్తికర ఘటన జరిగినా మనకు తెలిసి పోతోంది.వాటి తాలూకా వీడియోలు మనం ఫోన్‌లలో చూసేస్తున్నాం.

అందులో ఏ మాత్రం వెరైటీగా ఉన్న షేర్లు, కామెంట్లు, వ్యూస్ విపరీతంగా వస్తాయి. కుక్క, పిల్లి స్నేహంగా ఉండడమో, కోడి - కుక్క కలిసి ఉండడం ఇలా ఎన్నో వైవిధ్యమైన వీడియోలను మనం చూసే ఉంటాం.

అయితే ఇప్పుడు ఓ అడవిలో ఏనుగు, అడవి దున్న పరస్పరం తలపడిన వీడియో ఆసక్తి కరంగా ఉంది.పచ్చిక బయళ్లలో జంతువుల పోరు: ఆ వీడియోలో చుట్టూ చక్కని ఆహ్లాదకరమైన రీతిలో పచ్చిక బయళ్లు కనిపిస్తున్నాయి.అక్కడ ఓ ఏనుగు పిల్ల సంచరిస్తోంది.

అకస్మాత్తుగా ఓ అడవి దున్న ఆ ప్రాంతానికి వచ్చింది.వచ్చీ రావడంతోనే ఏనుగు పిల్లపై దాడికి యత్నించింది.

Advertisement

అయితే ఏనుగు పిల్ల కూడా తీవ్రంగా ప్రతిఘటించింది.మొదట దూరంగా ఉన్న అడవి దున్నను ఏనుగు పిల్ల చూసింది.

దాని ముందుకు వేగంగా వెళ్లి ఏ మాత్రం బెదరకుండా నిల్చుంది.దీంతో దాడి చేద్దామన్న ఆలోచనను అడవి దున్న విరమించుకుంది.

చివరికి చేసేదేమీ లేక అడవిదున్న వెను దిరిగింది.వీడియోకు విపరీతమైన క్రేజ్: ఇలాంటి ఆసక్తికర విషయాలు కావొచ్చు, వీడియోలు కావొచ్చు.ఎవరో ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

తాజాగా ఏనుగు పిల్ల-అడవి దున్న వీడియోను కూడా నీలగిరి ప్రాంతానికి చెందిన కిషోర్ చంద్రన్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.కొద్ది సేపటికే దీనికి అధిక సంఖ్యలో కామెంట్లు, షేర్లు వచ్చాయి.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?

చాలా మంది ఆ జంతువుల పోరుపై ఆసక్తికరంగా కామెంట్లు పెడుతున్నారు.

Advertisement