ఆ అవార్డు అందుకోవడానికి మీరే అర్హులు.. కాజల్ పోస్టు వైరల్!

వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కాజల్ అగర్వాల్ తనకు కుమారుడు పుట్టిన తర్వాత కాస్త సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే త్వరలోనే ఈమె భారతీయుడు2 సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

 You Deserve To Receive That Award Kajal S Post Is Viral ,kajal , Post Is Viral-TeluguStop.com

ఇకపోతే సినిమాల పరంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే కాజల్ అగర్వాల్ సూర్య జ్యోతికలకు అభినందనలు తెలియజేస్తూ షేర్ చేసినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇటీవల 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందజేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ అవార్డులలో భాగంగా సూర్య నటించిన సూరారై పోట్రు సినిమాకి గాను ఐదు అవార్డులు వచ్చిన విషయం మనకు తెలిసిందే.తాజాగా జరిగిన ఈ అవార్డు కార్యక్రమాలలో భాగంగా సూర్య కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డును అందుకున్నారు.

ఈ సినిమాలో నటించిన హీరోగా నటించిన సూర్య ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగా ఈ సినిమాని నిర్మించినందుకు నిర్మాతగా జ్యోతిగా ఈ అవార్డును అందుకున్నారు.

ఇక ఈ సినిమాని తెలుగులో ఆకాశమే హద్దురా అనే పేరుతో విడుదల చేయగా తెలుగులో కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇలా వీరిద్దరూ జాతీయ పురస్కారాన్ని అందుకోవడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఈ నటీనటులకు శుభాకాంక్షలు వెల్లవెత్తుతున్నాయి ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ సైతం సోషల్ మీడియా వేదికగా.జాతీయ అవార్డును అందుకున్నందుకు అభినందనలు.

ఇలాంటి అవార్డును అందుకోవడానికి మీరే అర్హులు అంటూ కాజల్ అగర్వాల్ సూర్య జ్యోతికలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube