అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి అని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ను ఎన్నో మిలియన్ల మంది ప్రజలు వినియోగిస్తున్నారు.
ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ లో మాత్రమే కాకుండా మల్టీడివైజ్ బీటా ప్రోగ్రామ్ ద్వారా వాట్సాప్ యూజర్లు ఇప్పుడు వారి వెబ్ వెర్షన్, డెస్క్‌టాప్ పోర్టల్ నుంచి కూడా వాట్సాప్ ని యాక్సెస్ చేసుకోవచ్చు.ఒకే సమయంలో ఏకంగా నాలుగు డివైజ్ లలో లాగిన్ కావచ్చు.
మీ వాట్సాప్ ను వెబ్ కు కనెక్ట్ చేయాలంటే ప్రతిసారి స్మార్ట్ ఫోన్ ద్వారా QR కోడ్ స్కానింగ్ చేయాలిసి ఉంటుంది.ఇప్పుడు వాట్సాప్ యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ కు కనెక్ట్ కానప్పటికీ కూడా డెస్క్‌టాప్ లో వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ ను వినియోగించు కోవచ్చు.
ఈ కొత్త ఫీచర్ ఉపయోగించి ఏక కాలంలో నాలుగు డివైజ్ లు కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట.కానీ మీ ప్రైమరీ డివైజ్ 14 రోజులకు పైగా డిస్‌కనెక్ట్ అయితే మాత్రం లింక్ అయిన మల్టీ డివైజ్ లన్నీ ఆటోమాటిక్ గా వాటంతట అవి లాగ్ అవుట్ అయిపోతాయి.
మరి స్మార్ట్ ఫోన్ లేకుండా వాట్సాప్ వెబ్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా.మొదట మీ స్మార్ట్ ఫోన్ ను వెబ్, డెస్క్‌టాప్ లేదా పోర్టల్ కి లింక్ చేయండి.
ఆ తర్వాత మీరు స్మార్ట్‌ఫోన్ లేకుండానే వాట్సాప్ వెబ్ వినియోగించుకోవచ్చు.

అంటే మీ ఫోన్‌లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేసిన తరువాత మొబైల్ స్క్రీన్ టాప్ రైట్ కార్నర్ వద్ద ఉన్న మూడు డాట్స్ ఐకాన్ పై నొక్కండి.అక్కడ మీ ఫోన్ కు లింక్ అయిన డివైజ్ లపై క్లిక్ చేయండి.ఆ తరువాత మల్టీ డివైజ్ పై మళ్లీ క్లిక్ చేయండి.
అప్పుడు మీకు అక్కడ వాట్సాప్ ఫీచర్ ను వివరించే పేజీ డిస్‌ప్లే అవుతుంది.అక్కడ జాయిన్ బీటా అనే ఆప్షన్ కనిపిస్తుంది.
అక్కడ క్లిక్ చేసి కంటిన్యూ బటన్‌ను నొక్కండి.అలా QR కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ వాట్సాప్ వెబ్ కు లింక్ చేయండి.
అయితే ఈ ఫీచర్ అనేది పాత వెర్షన్ ఉపయోగిస్తున్న డివైజ్ లలో పని చేయదు.