Digital Gifts : ఆలయాలలో స్కాన్ చేసి డబ్బులు వేయొచ్చు.. డిజిటల్ కానుకలకు ప్రోత్సాహం..

నరేంద్ర మోదీ సర్కార్‌లో భారతదేశం పూర్తిగా డిజిటలైజేషన్ అయిపోతుంది.డబ్బుకు సంబంధించి అన్ని కార్యకలాపాలను మొబైల్‌లోనే చిటికెలో ఫినిష్ చేసుకునేలా నేడు ఇండియాలో సదుపాయాలు ఉన్నాయి.

అందువల్ల ఎవరూ కూడా తమ జేబుల్లో కరెన్సీ నోట్లు, నాణేలు పెట్టుకొని తిరగడం లేదు.దీనివల్ల కొన్నిసార్లు ఎవరికైనా విరాళాలు ఇవ్వాలన్నా, దానాలు చేయాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ముఖ్యంగా ఆలయాల్లోని హుండీలలో ఎంతోకొంత డబ్బులు వేసి పుణ్యం కట్టుకుందామనుకునే వారికి సమయానికి భౌతికంగా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు.దీనివల్ల ఆలయాలకు కూడా రెవిన్యూ తగ్గుతుంది.

అయితే ఈ సమస్యకు పరిష్కారంగా దేవాలయాల్లో సైతం ఎలక్ట్రిక్ హుండీల విధానాన్ని తీసుకొచ్చే పనిలో పడ్డారు నిర్వాహకులు.ఈ-హుండీలు ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

అది మరెక్కడో కాదు మన తెలుగు రాష్ట్రం తెలంగాణలోనే! ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా డిజిటల్ విధానంలో స్వామి వారికి కానుకలను వేయడానికి వీలుగా ఈ-హుండీలు ఏర్పాట్లు చేస్తున్నారు.దీనివల్ల ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింపుల్‌గా స్వామి వారికి డిజిటల్ రూపంలో డబ్బులు అందించడం సాధ్యమవుతుంది.

రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు భక్తుల సౌకర్యార్థం ఈ క్యాష్‌లెస్ విధానాన్ని అమలు చేస్తున్నారు రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా వెలగటూర్ మండలంలోని కోటిలింగాల కోటేశ్వర స్వామి దేవాలయంలో ఈ-హుండీని ఏర్పాటు చేశారు.ఇక్కడికి వచ్చిన భక్తులు కానుకలు సమర్పించుకోవడానికి క్యూఆర్ స్కాన్ చేసి తమకు చాతనైనంత దానం చేశారు.సిద్దిపేట జిల్లా నాచారం గుట్ట నాచగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అధికారులు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు.

వారు లక్ష్మీనరసింహ స్వామి వారి పేరుమీద ఒక బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి.క్యూఆర్ కోడ్‌ను ఆలయంలో అంటించారు.దానిని స్కాన్ చేసి భక్తులు కానుకలు ఇస్తున్నారు.

తెలంగాణలోని ఇతర ప్రముఖ ఆలయాల వద్ద కూడా ఈ విధానం అమల్లోకి వస్తోంది.ఏదేమైనా ఈ ఆలోచనను భక్తులతో పాటు చాలామంది ప్రశంసిస్తున్నారు.

వీడియో: ఇది ఎక్కడ బౌలింగ్ రా బాబు.. ఇట్లా చేతులు తిప్పుతున్నాడేంటి..
Advertisement

తాజా వార్తలు