ఈ రెండు పదార్థాలతో పొడవాటి జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు.. తెలుసా?

సాధారణంగా చాలా మంది అమ్మాయిలు పొడవాటి జుట్టు కావాలని కోరుకుంటారు.అయితే ఇటీవ‌ల‌ రోజుల్లో అది అసాధ్యంగా మారింది.

పెరిగిన కాలుష్యం, కెమికల్స్ అధికంగా ఉండే షాంపూలను వాడటం, హెయిర్ స్టైలింగ్‌ టూల్స్ ను ఎక్కువగా వినియోగించడం, పోషకాల కొర‌త‌, ఒత్తిడి తదితర కారణాలు వల్ల హెయిర్ గ్రోత్ ఆగిపోతుంటుంది.దాంతో పొడవాటి జుట్టు కల కలగానే మిగిలిపోతుంది.

అలా జరగకుండా ఉండాలి అంటే కచ్చితంగా మీరు ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటించాల్సిందే.మరి లేట్ చేయకుండా రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు కలోంజీ సీడ్స్ వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్‌ పౌడర్ వేసుకోవాలి.

Advertisement
You Can Get Long Hair With These Two Ingredients, Long Hair, Kalonji Seeds, Curd

అలాగే ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పెరుగును వేసి రెండు కలిసేంత వరకు స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్‌ షాంపూను ఉపయోగించి తల స్నానం చేయాలి.కలోంజీ సీడ్స్ మరియు పెరుగులో జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో అమోఘమైన పోషకాలు నిండి ఉంటాయి ఈ రెండు పదార్థాలతో పైన చెప్పిన విధంగా హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల జుట్టు పొడుగ్గా మరియు ఒత్తుగా పెరుగుతుంది.

You Can Get Long Hair With These Two Ingredients, Long Hair, Kalonji Seeds, Curd

చిట్లిన జుట్టు రిపేర్ అవుతుంది.జుట్టు రాల‌డం క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డుతుంది.హెయిర్ గ్రోత్ గ్రేట్‌గా ఇంప్రూవ్ అవుతుంది.

పొడవాటి జుట్టు కావాలని కోరుకునే వారికి ఈ రెమెడీ ఎంతో ఉత్తమం గా సహాయపడుతుంది.కాబట్టి తప్పకుండా పాటించండి.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు