కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ మేరకు ఆయన ప్రజలకు వంద రూపాయల బాండ్ పేపర్ రాసిచ్చారని తెలుస్తోంది.
తాను గెలిచిన తరువాత కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని మదన్ మోహన్ బాండ్ పేపర్ మీద రాసిచ్చారు.ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా పనులు జరిపిస్తానని హామీ ఇచ్చారు.
అలాగే తన వేతనాన్ని పేదవారి ఇళ్ల నిర్మాణం కోసమే ఖర్చు చేస్తానని బాండ్ పేపర్ లో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ప్రజలు తనకు సహకరించి, తనపై నమ్మకం ఉంచి ఓటు వేయాలని కోరారు.