అధికారం పై జగన్ లో పెరుగుతున్న ధీమా?

తెలుగుదేశం జనసేన పొత్తులు ప్రకటించిన తర్వాత కొంత తొట్రుపాటుకు గురైన అధికార వైసిపి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) తర్వాత ప్రభుత్వం ఊహించినంత స్థాయిలో వ్యతిరేకత రాకపోవటం, పరిస్థితులన్నీ కంట్రోల్ లో ఉండటం తెలుగుదేశం శ్రేణులు బలహీన పడినట్లుగా కనిపించడం తో అంతా తామనుకున్నట్లే నడుస్తుంది అన్న ధీమా జగన్ లో కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది.అంతేకాకుండా కేంద్రం నుంచి కూడా పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందడం సంక్షేమ పథకాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయగలగటం.

 Ycp Ys Jagan Confident On Winning Elections,ycp, Ys Jagan,ap Elections,ys Jagan-TeluguStop.com
Telugu Ap, Tdpjanasena, Ycp, Ys Jagan-Telugu Top Posts

జనసేన తెలుగుదేశం పొత్తు( TDP Janasena Alliance )పై ముందులో ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు సాధారణ ప్రజానీకం లో తగ్గుతుండడంతో కచ్చితంగా తమ విజయాన్ని రిపీట్ చేస్తామన్న ధీమా అధికార వైసీపీలో కనిపిస్తుంది.ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పన లోనూ , పారిశ్రామిక అభివృద్ధిలోనూ కొంత వెనుకబడినప్పటికీ సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్న దని చెప్పవచ్చు.ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా మేలు కలిగించే రీతిలో సంక్షేమ పథకాలను రూపొందించడంలో వైసీపీ( YCP ) సక్సెస్ అయింది.అదే ఇప్పుడు ఆ పార్టీకి శ్రీరామరక్షగా మారింది అని చెప్పవచ్చు .

ఇంటింటికి తిరుగుతున్న వైసిపి నాయకులు శ్రేణులు( YCP Leaders ) కచ్చితంగా లెక్కలతో సహా ఏ కుటుంబానికి ఎంత మేలు కలిగిందో చెప్పగలడంతో కాదనలేని పరిస్థితులో సాధారణ ఓటరు ఉన్నాడు .ఇలా కళ్ళ ముందు సంక్షేమం కనిపిస్తూ ఉంటే దానికి బదులు తీర్చుకోవాలన్న భావనను వీరు సగటు ఓటర్లకు కలిగిస్తున్నారు.ఇది కచ్చితంగా వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.ప్రతిపక్షాలు ఎన్ని హామీలు ఇస్తున్నప్పటికీ గాలిలో ఉన్న పక్షి ని చూసుకొని చేతిలో ఉన్న పక్షిని వదిలేసుకునే సాహసం సాధారణ ప్రజలు చేయరు.

Telugu Ap, Tdpjanasena, Ycp, Ys Jagan-Telugu Top Posts

దాంతో తమ సంక్షేమం కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుందని నమ్ముతున్న జగన్ ప్రభుత్వ వ్యతిరేకతను( Ys Jagan Government ) సాధ్యమైనంత తగ్గించుకునే ఏర్పాట్లను కూడా ముమ్మరం చేశారు ఎక్కడికక్కడ నాయకులకు టార్గెట్లు నిర్ణయిస్తూ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా యుద్ధ ప్రాతిపదికన తీర్చాలంటూ సూచిస్తున్నారు దాంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా ఈ నాలుగైదు నెలల కాలంలో న్యూట్రలైజ్ చేసే అవకాశం కనిపిస్తుంది.రాజకీయ ప్రతీకారాలను ప్రజలు పెద్దగా పట్టించుకోరని తమకు జరిగిన మంచే వారిని పోలింగ్ బూతుల వరకూ నడిపిస్తుందని నమ్ముతున్న జగన్ నమ్మకం ఎంత మేరకు నిజమవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube