ప్రకాశం జిల్లా వైసీపీలో( YCP ) రాజకీయ వేడి రాజుకుంది.ఒంగోలులోని ఎంపీ మాగుంట శ్రీనివాసులు( MP Magunta Srinivasulu ) నివాసంలో కీలక సమావేశం జరుగుతోందని తెలుస్తోంది.
ఈ క్రమంలో మాగుంటతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్( Ex Minister Balineni Srinivas ) భేటీ అయ్యారు.ఈ సమావేశంలో దర్శి మాజీ ఎమ్మల్యే, ప్రస్తుత ఇంఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి( Buchepalli Siva Prasad Reddy ) హాజరయ్యారు.
సీట్ల విషయంపై ముగ్గురు నేతలు ప్రధానంగా చర్చిస్తున్నారని సమాచారం.అయితే మాగుంటను ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా కొనసాగించాలని బాలినేని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.ఈ వ్యవహారంపై సుమారు 45 రోజులుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది.తాజాగా ముగ్గురు నేతల సమావేశం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.