వైసీపీ పార్టీలో కీలకమైన నేతలలో విజయసాయిరెడ్డి ఒకరు.వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలుత ఉత్తరాంధ్ర రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించిన ఆయన తర్వాత పార్టీ పదవులతో కేడర్ ని ముందుకు నడిపించడం జరిగింది.
ఇక ఇదే సమయంలో రాజ్యసభలో కూడా కీలకంగా రాణిస్తూ ఉన్నారు.పార్లమెంట్ పరిధిలో ఉండే గౌరవమైన పదవులు కూడా అధిరోహించడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే ఎంపీ విజయసాయి రెడ్డికి సన్ సద్ అవార్డుకు ఎంపికయ్యారు.

2023 సంవత్సరానికి గాను సన్ సద్ రత్న విజేతల అవార్డుల లిస్టును కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు.ఈ లిస్టులో విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు.ప్రస్తుతం రాజ్యసభ తరఫున సాంస్కృతిక, రవాణా, పర్యాటక వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి విజయసాయిరెడ్డి అధ్యక్షత వహిస్తున్నారు.
ఈ క్రమంలో జ్యూరీ కమిటీ 13 మంది ఎంపీలతో పాటు 2 పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలకు సంబంధించి ఈ ఏడాది.ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటించడం జరిగింది.
ఈ క్రమంలో సన్ సద్ అవార్డుకు ఎంపికైన ఎంపీలకు ప్రధాని మోడీ సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేశారు.







