ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే.రైతులకు సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఢిల్లీలో.ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ కావడం జరిగింది.సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి తెలియజేశారు.ప్రధాని మోడీతో జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యలపై అదే రీతిలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో.
ఎంపీలు లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు.స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన సమస్యలపై చర్చించడానికి ప్రధాని మోడీ ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఇవ్వటం జరిగింది అందుకు గాను ఆయనకు ధన్యవాదాలు అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పష్టం చేశారు. ఇదే భేటీలో రాష్ట్రానికి సంబంధించి రావలసిన పెండింగ్ నిధులు గురించి కూడా చర్చించినట్లు సమాచారం.
విభజనతో అనేక కష్టాల గుండా వెళ్తున్న రాష్ట్రంపై వరుసగా ప్రకృతి పగబట్టినట్లు తుఫాన్లు రావటంతో పాటు… తుఫాన్ మిగిల్చిన నష్టాన్ని ప్రధాని మోడీ దృష్టికి విజయసాయిరెడ్డి తీసుకెళ్లినట్లు సమాచారం.అదే రీతిలో పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజయసాయిరెడ్డి కోరినట్లు వార్తలు వస్తున్నాయి.