చంద్రబాబుకు ఎంపీ మార్గాని భరత్ సవాల్..

తాడేపల్లి-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం: లోక్ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్, ఎంపీ శ్రీ మార్గాని భరత్ ప్రెస్ మీట్.

హైదరాబాద్ లో నివాసం ఉండే ఆ ముగ్గురికీ.

అమరావతి రాజధాని కావాలా.!? అమరావతిలో చంద్రబాబు అండ్ కో రియల్ ఎస్టేట్ దందాలు చేశారు.జోలె యాత్ర డబ్బులు బాబు దోచుకుని, దాచుకున్నాడా.?.దత్తపుత్రుడి అజ్ఞానం బయటపడింది.బాబు నుంచి ప్యాకేజీ అందగానే దత్తపుత్రుడి ట్వీట్లు.

భరత్ మాట్లాడుతూ.ఇంకా ఏమన్నారంటే.

30 వేల మంది పాదయాత్ర చేస్తే.వారికి బస ఎక్కడ, ఎలా.!?

తెలుగుదేశం పార్టీ ముసుగులో, కొంతమంది చంద్రబాబు బినామీలు, బడా బాబులు.రైతుల పేరుతో చేస్తున్న యాత్ర అది.30 వేల మంది రైతులు యాత్ర చేస్తున్నారని కల్లబొలి కబుర్లు చెబుతూ ఎల్లో మీడియాలో తాటికాయంత అక్షరాలతో రోజూ ఓహో.ఆహో.అని వారికి వారే జబ్బలు చరుచుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు.30 వేల మంది రైతులు పాల్గొంటే.వారంతా రాత్రిళ్ళు ఎక్కడ బస చేస్తున్నారు.?.ముగ్గురికి ఒక రూము చొప్పున ఇచ్చినా 10 వేల రూములు కావాలి.గ్రామాల్లో పది వేల రూములు ఉంటాయా.?.కేవలం మీ మనుగడ కోసం, మీకు వత్తాసు పలికే ఎల్లో మీడియాలో వేల మంది రైతులు యాత్ర అంటూ మీకు మీరే డప్పాలు కొట్టుకుంటున్నారు.వాస్తవానికి అది రైతుల యాత్ర కాదు.

అది కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న యాత్ర.రాష్ట్ర విభజన సమయంలో రాజధాని నిర్ణయానికి, కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది.

Advertisement

సెక్షన్ 6 ప్రకారం వికేంద్రీకరణ జరగాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని పేర్కొంది.రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ కమిటీని తుంగలో తొక్కి, తన మనుషులతో, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఒక కమిటీని వేసుకుని, అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ దందాలు చేసింది వాస్తవం కాదా.? ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూస్తే, తొలుత మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కూడా, తెలుగు మాట్లాడే వ్యక్తులు మద్రాసులో సెటిల్ అయ్యి, తద్వారా కొంతమంది వ్యక్తులు అభివృద్ధి చెందారే తప్పితే.మన ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందలేదు.

ఆ తర్వాత 65-70 ఏళ్ళపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో అంతా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేశారు.ఉదాహరణకు ఏపీ పేపర్ మిల్స్ సంస్థలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను సైతం అమ్మి అప్పట్లో హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడం జరిగింది.

ఈ విధంగా వేల, లక్షల కోట్ల పెట్టుబడులు హైదారాబాద్ కు తరలి వెళ్ళాయి.ఇవన్నీ మన కంటిముందు కనిపిస్తున్న వాస్తవాలే.

హైదారాబాద్ లో నివాసం ఉంటూ.అమరావతి రాజధాని కావాలా.!?

చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు.ఆ ట్వీట్లల్లో పస లేకపోయినా, పేలకపోయినా, వాటిని ఎల్లో మీడియాలో ప్రచారం చేసి, ఏదో జరిగిపోతుందన్నట్టుగా బురదజల్లుతున్నారు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన దత్తపుత్రుడు.ఈ ముగ్గురూ ఎక్కడ నివసిస్తున్నారు.?

హైదరాబాద్ లో మీరు నివాసం ఉంటూ అమరావతి రాజధాని కావాలంటారా.?.ఇదెక్కడి న్యాయం.!?

వారి మాటలు ఎలా ఉన్నాయంటే.అమరావతి రాజధాని కావాలి.

Advertisement

మేము మాత్రం అక్కడ ఉండం అన్నట్టు ఉంది.అమరావతిలో ఇల్లు కట్టుకుని, ఇక్కడే నివసిస్తున్న నాయకుడు జగన్ గారు.

ఒక కులమే, ఒక ప్రాంతం మాత్రమే బాగుండాలనే స్వార్థ బుద్ధి ఎవరికీ ఉండకూడదు.ఇప్పటికైనా వాళ్ళు మారాలి.

దత్తపుత్రుడికి ప్యాకేజీ వచ్చిన వెంటనే ట్వీట్లు పెడతాడు.చంద్రబాబు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి, అమరావతిలో ఏం అభివృద్ధి చేశారు.

బాహుబలి, ఇతర సినిమాల దర్శకులను తీసుకొచ్చి గ్రాఫిక్స్ గీయించి.వాటిని ఎల్లో మీడియాలో ప్రచారం చేయించి.

ఆహో అమరావతి.ఓహో అమరావతి అని చూపించడం మినహా.

అదే జగన్ మోహన్ రెడ్డిగారి హయాంలో.ఉత్తరాంధ్ర ప్రాంతంలో, విశాఖపట్నానికి సమీపంలో భోగాపురం విమానాశ్రయానికి కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది.36 నెలల్లో అంతర్జాతీయ విమానాశ్రయం తయారవబోతుంది.ట్రాఫిక్ ను నియంత్రించేందుకు, కేంద్రం 12 ఫ్లైఓవర్లు మంజూరు చేసింది.

ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రావడం వల్ల, ఇప్పటికే విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం వల్ల.ఒక మహా వృక్షంలా విశాఖపట్నం అభివృద్ధి కనిపిస్తుంది.ఇప్పుడిప్పుడే ఆ మహావృక్షం నుంచి కాయలు వస్తున్నాయి.

అవన్నీ తానే దాచేసుకుని.అమరావతిలోనే తిరిగి విత్తనం నాటతాను, అవి పెరిగితే తాను, తనతోపాటు తన బినామీలు దోచుకుంటాము అన్నట్టు బాబు అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని చెబుతున్నాడు.

మేము అమరావతికి వ్యతిరేకం కాదు.అమరావతి రాజధానిగా ఉండకూడదని అనటం లేదు.

అమరావతి కూడా ఒక రాజధానిగా ఉండాలని చెబుతున్నాం.

దత్తపుత్రుడి అజ్ఞానం

2018లో గుంటూరు సభలో ఇదే చంద్రబాబు దత్తపుత్రుడు మాట్లాడింది ఏమిటంటే.

రాజధాని పేరుతో కేవలం అమరావతి చుట్టుపక్కలే అభివృద్ధి కావాలా.వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ఏమవ్వాలి అని అన్నారు.

మరి, ఇప్పుడెందుకు అమరావతే రాజధాని కావాలని ఆ దత్తపుత్రుడు ట్వీట్లు పెడుతున్నారు.?.అంటే ఆయన మాటలకు, ట్వీట్లకు పొంతన ఉండదా.? రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలియని అజ్ఞానిలా." 25 జిల్లాలను.

యునైటెడ్ ఆఫ్ ఆంధ్రా"గా చేయమని ఆ దత్తపుత్రుడు చెబుతున్నారు.యునైటెడ్ అని ఎప్పుడు పిలుస్తారో కూడా తెలియకుండా, కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నాడు.

అమరావతి ఒక్కటే కావాలంటే 23 మంది రాజీనామా చేయండి

అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు భావిస్తే."ఉత్తరాంధ్రకు అభివృద్ధి వద్దు- విశాఖకు రాజధాని వద్దు" అని చెప్పండి.

అసెంబ్లీని రద్దు చేయమని చెబుతున్న అచ్చెన్నాయుడుకు చెబుతున్నాను.మిమ్మల్ని, మీ అవినీతిని, మీ విధానాలను తిరస్కరించటం వల్లే 2019లో ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు.

అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని, దానిపైనే మీకు నమ్మకం ఉంటే.అక్కడ మీ భూములు కాపాడుకోవాలని ఉంటే.

మీ పార్టీ గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించండి.జగన్ మోహన్ రెడ్డిగారు, దమ్మూ, ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ ని విభేదించి, బయటకు వచ్చి, తనతోపాటు వచ్చిన 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి, జగన్ గారి వెంట నడిస్తే.

వారంతా తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.మీకు కూడా దమ్మూ, ధైర్యం ఉంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళండి.

ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది.గత మూడేళ్ళుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు.

ఒక్క రూపాయి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.పేదల కుటుంబాలు, ప్రజల స్థితిగతులు మార్చేందుకు, మహిళల చేతికే సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.

కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.జగన్ గారు జన రంజక పాలన అందిస్తుంటే.

మీరు మాత్రం మీ కులం, మీ తాలుక కొంతమంది వ్యక్తులు, బడా బాబులు బాగుండాలని యాత్రలు చేస్తారా.?.అన్ని ప్రాంతాల డబ్బులు తెచ్చి.అమరావతిలో పోస్తే ఎవరు బాగుపడతారు.? ఇప్పటికైనా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు తమ వైఖరి మార్చుకోవాలి.ఉత్తరాంధ్రలో మీరు అడుగుపెడితే.

ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు జాగ్రత్త.మీ ఆలోచనను విరమించుకోండి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా సమిష్టిగా కృషి చేసి ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధనకు కృషి చేస్తున్నాం.ఈ సమయంలో చంద్రబాబు అధికారంలో ఉంటే.

ఆంధ్రప్రదేశ్ ను అంధకారంలోకి నెట్టేవాడే.ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడే వ్యక్తులు ఎవరు.

ప్రజలను దోచుకుని, పీక్కుతినే వారు ఎవరనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.

చంద్రబాబు గతంలో అమరావతి పేరుతో జోలె పట్టుకుని జోలె యాత్ర చేశాడు.ఆ జోలె డబ్బులతోనే ఈరోజు అమరావతి యాత్ర చేయిస్తున్నాడా.?.జోలె యాత్ర ద్వారా వచ్చిన డబ్బును, బంగారం నగలును చంద్రబాబు ఏం చేశాడు.వాటన్నింటినీ దోచుకుని, దాచుకున్నాడా.?.అని భరత్ ప్రశ్నించారు.

తాజా వార్తలు