వికేంద్రీకరణ పై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.విశాఖకు పరిపాలన రాజధాని రాకుండా కుట్రలు పన్నుతున్నారన్నారు.
ఉత్తరాంధ్రకు ద్రోహం చేసేందుకు దిగజారి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.దసపల్లా భూములు వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పునే అమలు చేశామని చెప్పారు .ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 400 కుటుంబాలకు న్యాయం జరిగిందన్నారు.అనంతరం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారి ఆస్తులు శాఖలో ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
తనకు అక్కడ ఒక ఫ్లాట్ మాత్రమే ఉందని వెల్లడించారు.ఈ నేపథ్యంలో ఆస్తులు ఎంక్వయిరీపై టిడిపికి విజయ్ సాయి సవాల్ విసిరారు.
తన ఆస్తులపై సిబిఐ, ఈడి విచారణకు సిద్ధమన్న ఆయన.టిడిపి కూడా విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు.ఇద్దరం కోర్టులోనే తేల్చుకుందామని చెప్పారు.ఎవరు జైలుకు వెళ్తారు న్యాయస్థానమే నిర్ణయిస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.







