MLA Nallapureddy Prasannakumar Reddy: సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష - ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు శ్రీరామరక్ష అని కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం మండలంలోని రేబాల గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.తొలుత 17.5 లక్షలతో నూతనంగా నిర్వహించిన విలేజ్ క్లినిక్, 7 లక్షలతో వాటర్ ప్లాంట్, 22 లక్షలతో రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

 Ycp Mla Nallapureddy Prasannakumar Reddy Gadapa Gadapaku Mana Prabhutvam Campaig-TeluguStop.com

అనంతరం ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంభందించిన పత్రాలను ప్రజలకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం జగన్ మోహన్ రెడ్డి కి రెండు కళ్ళు అని పేర్కొన్నారు.జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మా పార్టీకి శ్రీరామ రక్ష అని అన్నారు.

పులివెందులలో జగన్ మోహన్ రెడ్డి పట్టు కోల్పోయాడు అని,ప్రజలు జగన్ మోహన్ రెడ్డి అసహ్యించుకుంటున్నారు అని,జగన్ మోహన్ రెడ్డి కి ఇదే చివరి అవకాశం అని ఆరోపణలు చేసిన చంద్రబాబు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.అసలు నువ్వు నీ కొడుకు పప్పు కుప్పం, మంగళగిరి లో గెలిచి చూపించండి…జగన్మోహన్ రెడ్డి సింహం కడుపున పుట్టాడు సింహం గానే ఉంటాడు…

నువ్వు జిత్తుల మారి నక్కవి చంద్రబాబు… నువ్వా జగన్ మోహన్ రెడ్డి ని విమర్శించేది…నువ్వు కాదు కదా స్వర్గంలో ఉన్న నీ అబ్బ దిగివచ్చిన ఎవ్వరూ ఏమీ పీకలేరు… కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది…కుప్పంలో అసలు నువ్వు గెలుస్తావో లేదో చూసుకో…పులివెందులకు శాశ్వత ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి ఉండబోతున్నారు అని పేర్కొన్నారు.

బాబాయ్ వివేకా హత్య కేసును పట్టించుకోవడం లేదు అని చంద్రబాబు పేర్కొన్నారు…దానికి జగన్ మోహన్ రెడ్డి కి ఏమైనా సంబంధం ఉందా…గ్రామంలో గొడవల కారణంగా ఆయన నీ హత్య చేశారు…ఎన్నిసార్లు కుప్పం కి ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వేం చేసావ్…చివరికి ఆర్డీవో కార్యాలయం కూడా తెచ్చుకో లేకపోతే జగన్మోహన్ రెడ్డికి లెటర్ పెడితే…జగన్ మోహన్ రెడ్డి ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేశారు…మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి…అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube