వైసీపీ ఎమ్మెల్యే ఇలాకాలో మ‌రో నేత‌... అధిష్టానం అండ‌తోనే..?

ఏపీలో ఎన్నిక‌ల‌కు దాదాపు మ‌రో రెండేళ్లు స‌మ‌యం ఉంది.అయితే ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీలు అన్నీప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో పార్టీ ప‌టిష్టానికి అన్ని పార్టీలు చేర‌క‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నాయి.అయితే ఇప్ప‌టికే వైసీపీలో వ‌ర్గ‌పోరు.

అసంతృప్తి వినిపిస్తోంది.కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇద్ద‌రు ముగ్గురు నేత‌లు ఉండ‌టంతో ఎవ‌రికి సీటు ద‌క్కుతుందోన‌ని ఫ్ర‌స్ట్రేష‌న్ లో ఉన్నార‌ట‌.

నియోజ‌క‌వ‌ర్గ అభివృద్దిపై దృష్టి పెట్ట‌కుండా ఇప్ప‌టినుంచే వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో అన్న టెన్షన్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నార‌ట‌.అయితే దీనికి కారణం మాత్రం అధిష్టానం నిర్వ‌హించిన స‌ర్వేలే కార‌ణ‌మట‌.

Advertisement
YCP MLA Is Another Leader In Ilaka Leadership Is With Anda , Pendurthi , Adeep R

మూడు నెలల ముందుగానే వారిని పిలిచి సర్వే రిపోర్టులు అంటూ బెదరగొట్టడమే కాకుండా పనిచేయని వారికి టికెట్లు ఇవ్వమని తేల్చిచెప్పడంతో ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు ఆందోళ‌న చెందుతున్నార‌ట‌.కాగా ప్ర‌స్తుతం ఓ ఎమ్మెల్యే అలాగే టెన్స‌న్ ప‌డుతూ త‌న‌కు మ‌రో నేత పోటీగా వ‌స్తున్నాడ‌ని టెన్స‌న్ ప‌డుతున్నాడ‌ట‌.

విశాఖ జిల్లాలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ అస‌హ‌నంతో ఆవేశానికి లోనవుతున్నార‌ట‌.కార‌ణం ఏంటంటే.

పెందుర్తి సీటు ఖాళీ అయిందని చాలా మంది ట్రై చేసేసుకోవడం ఈ సిట్టింగ్ కి అసలు నచ్చడంలేద‌ట.నేను బాగానే ఉన్నాను కదా మళ్లీ ఈ పోటీ ఏంటీ.? అని గుర్రుగా ఉన్నాడ‌ట‌.త‌న ఇలాకాలో మ‌రో నేత వ‌చ్చి హ‌డావుడి చేయ‌డం ఏ మాత్రం న‌చ్చ‌డం లేద‌ట‌.

త‌న‌కు పోటీగా ఇర‌గ‌డం ఏంట‌ని.మీడియా ముందుకు వచ్చి మరీ అత‌నితో మా పార్టీకి ఏమీ సంబంధం లేదని కూడా చెప్పేస్తున్నార‌ట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అయితే దీనికి ఆయన అనుచరలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.త‌మ నేత వైసీపీలో చేరిన సంగతి బహుశా ఎమ్మెల్యే గారికి తెలియకపోవచ్చ‌ని అంటున్నార‌ట‌.

Advertisement

ఆయన వైసీపీ నేత కాకపోతే జగన్ ఆయన్ని ఎందుకు క‌లుస్తార‌ని అంటున్నార‌ట‌.అస‌లు ఆ నేత ఎవ‌రంటే పంచ‌క‌ర్ల ర‌మేష్ బాబు.

ఈయ‌న 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ఎంట్రీ ఇచ్చి పెందుర్తిలో అనూహ్యంగా గెలిచారు.ఆ త‌ర్వాత టీడీపీలో చేరి ఎలమంచిలి నుంచి ఎమ్మెల్యే అయ్యారు.

ఇక 2019 ఎన్నికలో అదే సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.ఆ మీదట వైసీపీలో చేరారు.

అయితే గత రెండేళ్లుగా వైసీపీలో సైలెంట్ గా ఉన్న ఆయ‌న‌ ఇటీవల జగన్ పిలుపుతో వెళ్లి గట్టి హామీ తీసుకున్నార‌ట‌.ఈ క్ర‌మంలోనే తన పాత నియోజకవర్గం పెందుర్తిలో కలివిడిగా తిరిగేస్తున్నారు.

అందరినీ కలసి తాను మళ్లీ వచ్చేస్తున్నాన‌ని చెప్పేసుకుంటున్నార‌ట.ఈయ‌న అనుచ‌రులు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెందుర్తి నుంచి పోటీచేస్తార‌ని చెప్పుకుంటున్నార‌ట‌.

దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో అదీప్ రాజ్ వర్సెస్ పంచకర్ల అన్నట్లుగా మ‌రిందట‌.అయితే ఈ క్ర‌మంలోనే అన్ని గ‌మ‌నించిన అధిష్టానం అదీప్ రాజ్ కి క్లాస్ తీసుకుంద‌ని స‌మాచారం.దాంతో ఆయన కాస్తా తగ్గార‌ని స‌మాచారం.

అయితే ఎమ్మెల్యే టికెట్ మాత్రం మ‌ళ్లీ త‌న‌కే వ‌స్తుంద‌ని గట్టిగా చెప్పుకుంటున్నార‌ట‌.దీంతో ఆదీప్ రాజ్ లో ఫ్రస్ట్రేషన్ బాగానే పెరిగిందని అంటున్నారు.

అయితే మ‌రో ట్విస్ట్ ఏంటంటే.సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రాఫ్ సరిగ్గా లేద‌ని.మూడేళ్ల‌ పనితీరు మీద నెగిటివ్ గానే రిపోర్టులు వచ్చాయట.

దాంతో అధినాయకత్వం అక్కడ బలామైన కాపు నేతను ఈసారి దించాలని చూస్తోంద‌ని టాక్.ఈ క్ర‌మంలోనే పంచకర్లకు హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఇవ‌న్నీ చూస్తుంటే అదీప్ రాజ్ సీటు క‌ట్ చేసిన‌ట్లే అనిపిస్తోంది.ఇక‌ సీటు ఎవ‌రికి ద‌క్కుతుందో వేచిచూడాల్సిందే.

తాజా వార్తలు