ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా 50 రోజులు మాత్రమే సమయం ఉంది.దీంతో అధికారంలో ఉన్న వైసీపీ ( YCP )ఒక్క అనకాపల్లి పార్లమెంట్ మినహా మిగతా అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాల అభ్యర్థులు ప్రకటించడం జరిగింది.
ఈ క్రమంలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు రాలేదు.సో టికెట్ రాని వాళ్ళలో కొంతమంది పార్టీలోనే కొనసాగుతూ ఉండగా మరి కొంతమంది ఇతర పార్టీలలోకి వెళ్లిపోతున్నారు.
ఈ రకంగానే చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా( YCP MLA Eliza ) ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల( Sharmila ) సమక్షంలో ఎలీజా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.ఎలీజాకు కాంగ్రెస్ కండువా కప్పిన షర్మిల ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఈ సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ సొంత పార్టీ నాయకులపై విమర్శలు చేశారు.
తన పట్ల వైసీపీ నాయకులు కూట్రపూరితంగా వ్యవహరించారని తనకు సమాచారం ఇవ్వకుండానే ప్రాంతీయ సమన్వయకర్తలు సమావేశాలు పెట్టేవారని ఆరోపించారు.ఈ విషయం జగన్( jagan ) దృష్టికి తీసుకెళ్లిన ఆయన పట్టించుకోలేదని వాపోయారు.
కాంగ్రెస్ లౌకికవాద పార్టీ కావటం వల్లే ఆ పార్టీలో చేరినట్లు ఎలీజా వెల్లడించారు.ఇదే సమయంలో తనకు చింతలపూడి టికెట్ పై షర్మిల భరోసా ఇచ్చినట్లు స్పష్టం చేశారు.