ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎమ్మెల్యేలు మంత్రులు ఊపిరి మెసలకుండా విమర్శలు గుప్పిస్తున్నారు.చంద్రబాబు నాయుడుపై ఇప్పటికే మంత్రులు కొడాలి నానితో పాటు పలువురు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్న విషయం తెల్సిందే.
ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎమ్మెల్యే అప్పల రాజు సంచలన వ్యాఖ్యలు చేశాడు.అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే అప్పల రాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తీరుపై మండి పడ్డాడు.
అప్పల రాజు మాట్లాడుతూ.అధ్యక్ష నేను ఒక డాక్టర్‌ను.చంద్రబాబు నాయుడుకు ఒక మానసిక సమస్య ఉంది.అది చాలా పెద్ద జబ్బు.
ఆ జబ్బును నయం చేసిన తర్వాతే అసెంబ్లీకి తీసుకు రావాలి.ఆయన్ను వెంటనే హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందించాల్సిన అవసరం ఉందంటూ ఈ సందర్బంగా అప్పల రాజు అన్నాడు.
మానసిక వ్యాదితో బాధపడుతున్న చంద్రబాబు నాయుడు ఏదో భ్రమలో ఉంటున్నాడు.ఇంకా తానే సీఎం అన్నట్లుగా వ్యవహరించడం.
మాట్లాడటం చేస్తున్నాడంటూ అప్పల రాజు అన్నాడు.