ఈనెల 23వ తారీకు సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
కన్నా టీడీపీ కోవర్ట్ గానే బీజేపీలో చేరారు అని ఆరోపించారు.అందుకే రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించినట్లు స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఉండి టీడీపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు అని కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన కన్నా ఇప్పుడు చంద్రబాబు చెంత చేరడాన్ని ఏమనాలి అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.
ఇదిలావుండగా బీజీపీతో కలిసి ఉన్న జనసేనలోకి వెళ్ళొద్దని సహితులు అనుచరులు సూచన మేరకు టీడీపీ లోకీ వెళ్ళే నిర్ణయం తీసుకున్నట్లు కన్నా పేర్కొన్నారు.ఈరోజు మీడియా సమావేశం నిర్వహించిన ఆయన వైసీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దేశంలో ఉన్న అందరి ముఖ్యమంత్రులలో వైయస్ జగన్ అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు.జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాక్షస పాలన స్టార్ట్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.వైసీపీ నాయకుల అరాచకాలు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు.మళ్లీ అధికారంలోకి వస్తామని చెబుతున్న వైసీపీ వాళ్లు ప్రతిపక్షాలు అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
రాజ్యాంగబద్ధంగా పోలీసులు వ్యవహరించాలని లేకపోతే ప్రజల తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు.







