వైసీపీ అంటే జగన్ పార్టీ కాదు.. అందరి పార్టీ..: సీఎం జగన్

వైసీపీ( YCP ) ప్రభుత్వం వచ్చిన తరువాతే రాష్ట్రంలో ప్రతి పేదవాడికి న్యాయం చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.ఏపీలో సుపరిపాలన తీసుకొచ్చామని పేర్కొన్నారు.

 Ycp Is Not Jagan's Party.. Everyone's Party..: Cm Jagan ,ycp, Ap Politics, Tdp,-TeluguStop.com

వైసీపీ అంటే జగన్ పార్టీ కాదన్న ఆయన అందరి పార్టీ అని చెప్పారు.కష్టపడి పని చేసిన వారికి పదవులు ఇచ్చామన్నారు.92 శాతం కుటుంబాలకు మేలు చేశామన్నారు.ప్రతి ఇంటి నుంచి ఓ స్టార్ క్యాంపెయినర్ రావాలని పిలుపునిచ్చారు.

ఒక్కో స్టార్ క్యాంపెయినర్ వంద మందికి మన పథకాల గురించి చెప్పాలన్నారు.

ఈ ఎన్నికలు ఎంత అవసరమో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండని తెలిపారు.రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగాలంటే మీ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు.చెప్పినదానికంటే ఎక్కువ రావాలన్న జగనన్న ముఖ్యమంత్రి( CM YS JAGAN ) కావాలని తెలిపారు.

అలాగే మన పిల్లల తలరాతలు మార్చే ఎన్నికలు ఇవని పేర్కొన్నారు.గత ప్రభుత్వంలో పథకాలు ఇవ్వాలంటే లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని విమర్శించారు.

అటువంటి చెడిపోయిన వ్యవస్థలో మీ బిడ్డ జగన్ మార్పు తీసుకొచ్చారని తెలిపారు.విశ్వసనీయతకు అర్థం చెప్పింది ఒక్క జగన్ మాత్రమేనని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube