తెలుగుదేశం పార్టీ పై ముప్పేట దాడి చేయడానికి వైసీపీ, జనసేన రెండు పార్టీలు సిద్దమయినట్టుగా ఉంది నగరి ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలు వింటుంటే.గత కొన్ని రోజులుగా వైసీపీ లోని నేతలు అందరూ అధ్యక్షుడు జగన్ రెడ్డి తో లా అండ్ ఆర్డర్ గురించి ఎదో ఒక సమయంలో వ్యాఖ్యలు చేస్తున్నారు.
అసలు ఆ సమస్య రాకుండానే ముందుగానే ఈ వ్యాఖ్యలు ఇరు పార్టీలు చేయడం గమనార్హం.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పశ్చిమలో యాత్ర చేపట్టిన నాటి నుంచీ నేటి వరకూ కూడా లా అండ్ ఆర్డర్ పై ఎప్పటికప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు.
అసలు ఈ లా అండ్ ఆర్డర్ అంశం మొదట ఎత్తుకున్నది కూడా జనసేనే…ఇప్పుడు దాన్ని ఆచరిస్తోంది వైసీపీ.

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా ఇటీవల తన సొంత నియోజకవర్గం నగర్ లో రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.టీడీపీ అధికారంలో ఉంది నగరి ప్రజలపై కక్ష సాదిస్తోందని ఫైర్ అయ్యారు ఏదైనా ఉంటే వైసీపీ నేతగా నాపై పగ తీర్చుకోవాలి కానీ నియోజకవర్గానికి నిధులు ఇవ్వకుండా నన్ను ప్రజల ముందు బూచి ని చేసి చూపిస్తే ప్రజలకే నష్టం వాటిల్లుతోంది నగరి ప్రజలు అభివృద్దికి ఆమడ దూరంలో ఉండిపోయారు అంటూ ఫైర్ అయ్యారు.

చంద్రబాబు నాయుడు కావాలనే వైసీపీ నియోజకవర్గాలకి నిధులు ఇవ్వడంలేదని.అందుకే మా సొంత నిధులతో నియోజక వర్గ అభివృద్ధి పనులు చేస్తున్నామని జగన్ అధికారంలోకి వచ్చాక తప్పకుండా నగరి అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని నగరి నియోజకవర్గ ప్రజల ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే రోజా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తుందని ఇందుమూలంగా కలెక్టర్ కు ముందే ఫిర్యాదు చేసినట్లు రోజా తెలిపారు.







