ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎంపికపై అధికార వైసీపీ తుది కసరత్తు చేస్తోంది.ఈ మేరకు పార్టీలోని ముఖ్యనేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
కాగా ఇప్పటికే అభ్యర్థులుగా జయమంగళ వెంకటరమణ, కుడుపూడి సూర్యనారాయణ పేర్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.సమావేశం అనంతరం సీఎం జగన్ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.