టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Mega Powerstar Ram Charan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం చెర్రీ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమా( Game Changer Movie )లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
కాగా ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు( Producer Dil Raju ) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 75 శాతం షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో పొలిటికల్ అంశాలున్నాయనే సంగతి తెలిసిందే.

మూవీకి సంబంధించి వైజాగ్ లో తాజాగా మరో షెడ్యూల్ మొదలైంది.దీని కోసం విశాఖ బీచ్( Visakha Beach ) లో ఔట్ డోర్ సెట్ వేశారు మూవీ మేకర్స్.ఒక పబ్లిక్ మీటింగ్ కు సంబంధించిన సెట్ అది.రాజకీయ నాయకులు వేదికపై కూర్చుంటే, వాళ్ల వెనక ప్రభుత్వ అధికారిగా రామ్ చరణ్ నిల్చున్నట్టు, హీరోయిన్ కియరా అద్వానీ( Kiara Advani ) చీర కట్టులో అక్కడ ఉన్నట్టు కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట.ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న, తాజాగా బీచ్ లో వేసిన ఈ సెట్ లో వైసీపీ రంగులు కనిపించాయి.సినిమాల్లో పాలిటిక్స్ చూపించినప్పుడు ఏ పార్టీకి సంబంధం లేని రంగులు, జెండాలు వాడడం సహజం.
చివరికి టీవీ ఛానెల్ లోగోలు కూడా కాస్త మార్చి వాడుతుంటారు.

కానీ గేమ్ చేంజర్ కోసం విశాఖలో వేసిన సెట్ లో వైసీపీ పార్టీకి చెందిన రంగులు కనిపించాయి.సెట్ లో ఎగరేసిన జెండాల్ని దూరం నుంచి చూస్తే అచ్చం వైసీపీ జెండాల్లా( YCP Flags ) ఉన్నాయి.ఇక సినిమా కోసం నిర్మించిన స్టేజ్ సెట్ పై కూడా దాదాపు అవే రంగులు కనిపించడం ఆశ్చర్యం.
వైసీపీ జెండాలు, గుర్తులు సినిమా( YCP Symbols )లో వాడడంలో తప్పు లేదు.కానీ వాటిని నెగెటివ్ గా చూపించినా, పాజిటివ్ గా చూపించినా ఆ సినిమా యూనిట్ కే తలనొప్పులు.
ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక నటీనటులంతా నటిస్తున్నారు.ఎస్ జే సూర్య, అంజలి, శ్రీకాంత్, చరణ్, కియరా అద్వానీ ఇలా చాలామంది పాల్గొంటున్నారు.ఒకవేళ వైసీపీ పార్టీకి సంబంధించిన గుర్తులు సినిమాలో ఉంటే మాత్రం ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవని చెప్పాలి.