రెండు తెలుగు రాష్ట్రాల్లో యాత్ర2( Yatra2 ) మూవీ రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదలైంది.ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షోలు ప్రదర్శితమయ్యాయి.యాత్ర2 మూవీ బుకింగ్స్ నెమ్మదిగా పుంజుకుంటుండగా 30 కోట్ల రూపాయల అత్యంత భారీ టార్గెట్ తో ఈ సినిమా విడుదలైంది.ఈ టార్గెట్ ను రీచ్ కావడం యాత్ర2 మూవీకి సులువు కాకపోయినా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు ఈ సినిమా విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.
జగన్ బయోపిక్( Jagan biopic ) గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.మహి వి రాఘవ్ వైఎస్సార్, జగన్ పాత్రలను అద్భుతంగా స్క్రీన్ పై చూపించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జగన్ రోల్ కు జీవా( Jiiva ) పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేలా సినిమాలో ఎక్కువగా షాట్స్ ఉన్నాయి.దర్శకుడు ఎమోషనల్ సీన్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.
ఎమోషనల్ టచ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కగా కొన్ని ట్విస్ట్ లు సినిమాకు హైలెట్ గా నిలిచాయి.జగన్ పాదయాత్రకు సంబంధించిన షాట్స్ ను అద్భుతంగా తెరకెక్కించారు.సంతోష్ నారాయణ్ బీజీఎం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.
సీఎం జగన్( CM Jagan ) పాత్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ సినిమా ముగుస్తుంది.తెలుగులో ఇప్పటివరకు వచ్చిన బయోపిక్ సినిమాల్లో ఇదే బెస్ట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
యాత్ర2 మూవీకి బీ, సీ సెంటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోందని సమాచారం అందుతోంది.యాత్ర మూవీ డీసెంట్ కలెక్షన్లను సాధించగా యాత్ర2 మూవీ అంతకు మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది.యాత్ర2 ఫుల్ రన్ కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి యాక్టింగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి.