యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఈవో గీతారెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014లో యాదాద్రి ఆలయ ఈవోగా నియామకమైన గీతారెడ్డి 2020లో పదవి విరమణ చెందగా తిరిగి ప్రభుత్వం ఆమెనే ఈవోగా కొనసాగించింది.
ఆమె పైన అనేక ఆరోపణలు వచ్చినా గత ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.కాగా ఇటీవల ప్రభుత్వం మారడంతో బీఆర్ఎస్ అనుకూల అధికారులు రాజీనామాలు చేస్తున్న విషయం తెలిసిందే.
గుట్ట ఈఓ గీతారెడ్డి కూడా ఆ కోవలోకి వచ్చారంటున్నారు.అయితే ప్రభుత్వమే ఆమెను తప్పుకోవాలని చెప్పిందని,అందుకే రాజీనామా చేశానని తెలపడం గమనార్హం.







