మరి కాసేపట్లో లండన్ లోని ఓవల్( Oval in London ) వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్( World Test Championship Final Match ) ఆస్ట్రేలియా- భారత్ మధ్య ప్రారంభం అవ్వనున్న సంగతి తెలిసిందే.అయితే ఈ మ్యాచ్ భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు( Rohit Sharma is the captain of the Indian team ) ఎంతో కీలకం.

రోహిత్ శర్మ ఇప్పటివరకు 49 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు.నేడు జరిగే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ తో 50 టెస్ట్ మ్యాచ్లు పూర్తిచేసుకున్నాడు.ఇక 49 టెస్ట్ మ్యాచ్ లలో 83 ఇన్నింగ్స్ లు ఆడిన రోహిత్ శర్మ 45.7 సగటుతో 9 సెంచరీలు, 14 అర్థ సెంచరీలు చేసి మొత్తం 3379 పరుగులు చేశాడు.ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించి, జట్టును గెలిపిస్తే తన కెరీర్లో గుర్తుండిపోయే మైలురాయిగా ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.అంతేకాదు కేవలం 27 పరుగులు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్లో 13వేల పరుగులు పూర్తిచేసిన మూడవ భారత ఓపెనర్ గా సరికొత్త రికార్డు ఖాతాలో పడుతుంది.
ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ 15758 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.సచిన్ టెండుల్కర్ 15335 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు.ఇక మూడవ స్థానానికి అడుగు దూరంలో రోహిత్ శర్మ ఉన్నాడు.

ఇక క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ 12258 పరుగులు చేశాడు.ఈ క్రికెట్ దిగ్గజానికి సాధ్యం కానీ ఫిట్ ను అందుకున్న ఘనత రోహిత్ శర్మ సాధించనున్నాడు.ఈ నలుగురు క్రికెట్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో పదివేల పరుగులు పూర్తి చేసిన భారత ఓపెనర్లలో శిఖర్ ధావన్ 10867 పరుగులతో ఉన్నాడు.
ఇక రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్స్ లో విరాట్ కోహ్లీ 1803 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.రోహిత్ శర్మ 1794 పూలతో రెండవ స్థానంలో ఉన్నాడు.
డబ్ల్యూటీసీలో రోహిత్ శర్మ ఆరు సెంచరీలు, నాలుగు అర్థ సెంచరీలు సాధించాడు.నేడు జరిగే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ ద్వారా రికార్డులు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయి.