డబ్ల్యూపీఎల్ లో నేడే ఎలిమినేటర్ మ్యాచ్.. ఫైనల్ కోసం ఇరుజట్ల మధ్య ఉత్కంఠ భరిత పోరు..!

ముంబై వేదికగా ప్రారంభమైన డబ్ల్యుపీఎల్ ( WPL ) చివరి దశకు చేరుకుంది.

నేడే ముంబైలోని డీవీ పాటిల్ స్టేడియం లో ముంబై ఇండియన్స్- యూపీ వారియర్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.

నేటితో ఈ నెల 26వ తేదీ టైటిల్ కోసం ఢిల్లీతో పోటీపడే జట్టు ఏదో తెలిసిపోతుంది.ముంబై ఇండియన్స్( Mumbai Indians ) వరుసగా ఐదు విజయాలను ఖాతాలో వేసుకొని ప్లే- ఆఫ్ కు అర్హత సాధిస్తే.

యూపీ వారియర్స్( UP Warriors ) మాత్రం పడుతూ లేస్తూ, చివరికి ప్లే-ఆఫ్ కు అర్హత సాధించింది.ఇరుజట్లలో సమర్థవంతమైన ఆటగాళ్లు ఉండడంతో చివరి వరకు ఉత్కంఠంగా సాగే అవకాశం ఉంది.

ముంబై ఇండియన్స్ జోరు చూసి నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది అనుకుంటే రెండు మ్యాచ్లలో తడబడి, లీగ్ టేబుల్ లో రెండవ స్థానానికి చేరితే ఢిల్లీ క్యాపిటల్స్ రన్ రేట్ అధికంగా ఉండడంతో నేరుగా ఫైనల్ కు చేరింది.ఇక యూపీ వారియర్స్ లో బ్యాటర్లు అలీషా హేలీ 242 పరుగులు, తహీలియా మెక్ గ్రాత్ 295 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నారు.ఇక సోఫీ ఇకెల్ స్టెన్ 14 వికెట్లు తీసి ప్రత్యర్థులకు చెమటలు పట్టించింది.

Advertisement

ముంబై ఇండియన్స్ జట్టులో హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా, నాట్ స్కివియర్ బ్రంట్, అమేలీ కెర్, పూజా వస్త్రకర్, ఇసీ వాంగ్ లాంటి సమర్థులు ఉండడంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగే అవకాశాలు ఉన్నాయి.బ్యాటింగ్లో ఏ జట్టు నిలకడగా రాణిస్తుందో ఆ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఇక యూపీ వారియర్స్ లోని అలీసా హేలీ, తహీలియా మెక్ గ్రాత్, గ్రేస్ హ్యారీస్ లు సమర్థవంతంగా రాణిస్తే యూపీ వారియర్స్ ఫైనల్ కు వెళుతుంది.

లేకపోతే ముంబై ఇండియన్స్ ఫైనల్ కు వెళ్లే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు