వావ్.. పెళ్లిలో డ్రమ్స్ వాయించి దుమ్మురేపిన వధువు.. వీడియో వైరల్!

సాధారణంగా పెళ్లిలో వధూవరులు రింగులు మార్చుకోవడం, దండలు వేసుకోవడం, తాళి కట్టడం, ముద్దులు పెట్టుకోవడం వంటి పనులకే పరిమితమవుతారు.అలాగే ఫొటోలకు పోజులు ఇస్తుంటారు.

 Wow Dirty Bride Playing Drums At The Wedding Video Goes Viral , Marriage, Viral-TeluguStop.com

అంతకుమించి వారు పెళ్లి మండపం నుంచి దిగి మిగతా పనులు ఏమీ చేయరు.కానీ ఒక వధువు మాత్రం తన పెళ్లిరోజున తానే స్వయంగా డ్రమ్స్ వాయించింది.

దీంతో అవాక్కవడం అందరి వంతయింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి డ్రమ్స్ కిట్ ముందు కూర్చొని ఉండటం గమనించవచ్చు.నిజానికి ఆమే వధువు కానీ వధువు లాగా అస్సలు కనిపించడం లేదు కదా.అయినా నమ్మాల్సిందే.ఈ వధువు తన పెళ్లిలో డ్రమ్స్ అద్భుతంగా వాయిస్తూ అదరగొట్టింది.

చూస్తుంటే ప్రొఫెషనల్ డ్రమ్మర్ లాగా కనిపించింది.అలా ఆమె సంగీతం వాయిస్తుంటే అందరూ కళ్లప్పగించి మరీ ఎంజాయ్ చేశారు.

ఆమెతో పాటు ఇతర మ్యూజీషియన్లు పాట పాడుతూ సంగీతం వాయించారు.వీరి సంగీతానికి ఎంజాయ్ చేస్తూ కొందరు డ్యాన్స్ కూడా చేశారు.

దీనితో అక్కడి వాతావరణం అంతా కూడా ఒక పార్టీ మూడ్ లోకి వెళ్లి పోయింది.ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ బ్రైడ్ ఒక్క మ్యూజిక్ బీట్ కూడా స్కిప్ చేయకుండా అందరి హార్ట్ బీట్ పెంచేసిందని కామెంట్లు పెడుతున్నారు.ఈ వధువు తన పెళ్లిని తన ఓన్‌ మ్యూజిక్ షోలా బలే మార్చేసిందిగా అని ఇంకొందరు కామెంట్ చేశారు.

వావ్ వాట్ ఏ రాక్ స్టార్, అదరగొట్టేసింది అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

పూబిటీ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే రెండు లక్షల వరకు లైకులు, మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube