మన టాప్ డైరక్టర్ల రెమ్యునరేషన్స్ తెలిస్తే షాక్ అవుతారు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.

అయితే ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు అందరు దర్శకులు కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటే కొంతమంది మాత్రం తెలుగు లోనే సినిమాలు చేస్తున్నారు.

అయితే ఇప్పుడు సినిమాలు తీస్తున్న మన డైరెక్టర్ల యొక్క రెమ్యూనరేషన్లు తెలిస్తే మాత్రం అందరూ నోరేళ్లబెట్టాల్సిందే.ఒక్కొక్కరు కొన్ని కోట్లల్లోనే డబ్బులు తీసుకుంటున్నారని తెలుస్తుంది.

ఇక రాజమౌళి ( Rajamouli )లాంటి డైరెక్టర్ అయితే ఒక సినిమా కోసం 100 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అలాగే సుకుమార్ లాంటి డైరెక్టర్ ఒక సినిమా కోసం 50 కోట్లు చార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Would You Be Shocked To Know The Remunerations Of Our Top Directors , Rajamoul

త్రివిక్రమ్( Trivikram ) సినిమాలు ఇప్పటివరకు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాలేదు కానీ ఒక తెలుగు వర్షన్ కోసమే ఆయన 30 కోట్ల వరకు తీసుకుంటున్నాడు ఇక ఇది పాన్ ఇండియా రేంజ్ లోకి వెళ్తే మాత్రం 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు.ఇక కొరటాల శివ( Koratala Siva )కు కూడా ఎన్టీయార్ తో చేస్తున్న దేవర సినిమా కోసం 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.డైరెక్టర్లు అందరూ కూడా వరుసగా 50 కోట్ల మార్కుని దాటకుండా రెమ్యూన రేషన్ ను తీసుకుంటూ వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు.

Would You Be Shocked To Know The Remunerations Of Our Top Directors , Rajamoul
Advertisement
Would You Be Shocked To Know The Remunerations Of Our Top Directors , Rajamoul

ఇక ఇలాంటి క్రమం లోనే మన దర్శకులు చేసే సినిమాల మీద వాళ్ళ కెరియర్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి సినిమా సక్సెస్ ఫుల్ చేసుకోవడానికి విపరీతమైన తంటాలు పడుతున్నారు.ఇక ప్రతి డైరెక్టర్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేయాలని ఆరాట పడుతున్నారు.అయితే పాన్ ఇండియా రేంజ్ లో డైరెక్టర్లు ఎంత వరకు సక్సెస్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు