దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా వెంకన్న సన్నిధిలో పూజలు

తమ ఇంటిలో జరిగే ఏ శుభకార్యమైనా ఇలవేల్పు వెంకన్న వద్ద నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం…దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకలను తిరుమలలో జరుపుకుంటోంది.నేడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, ఇతర కుటుంబ సభ్యులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు.దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి అన్నదానం నిమిత్తం రూ.38 లక్షల విరాళాన్ని అందించారు.గురువారం ఉదయం అన్న వితరణ అనంతరం భక్తులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.అన్నప్రసాద వంటశాలను సందర్శించి అన్నదాన వివరాలను వాకబు చేశారు.ఏటా దేవాన్ష్‌ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల సన్నిధిలో ఒక్కరోజు అన్నవితరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది.

 Worship In Presence Of Venkanna On The Occasion Of Devansh's Birthday , Devansh'-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube