అది అత్యంత అరుదైన సముద్ర జీవి.. ఎలా ఉంటుందంటే..

ప్రపంచంలో ఈ జీవి జనాభా కేవలం 10 మాత్రమే.ఇది భూమిపై ఉనికిలో ఉన్న జీవుల విలుప్త జాబితాలో చేరింది.

 Worlds Most Endangered Rarest Sea Mammal ,marine Mammal , Mamma , Sea, San Fran-TeluguStop.com

ఇది ప్రపంచంలోని ఏకైక అరుదైన సముద్ర క్షీరదం.దాని పేరు వాకిటా పోర్పోయిస్.జన్యుపరమైన అధ్యయనం ఆధారంగా వారు ఈ విషయాన్ని చెబుతున్నారు.ఈ బూడిద, వెండి రంగు వాకిటా పోర్పోయిస్‌లు మెక్సికోలోని గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో మాత్రమే కనిపిస్తాయి.వాటి జనాభా అంతరించిపోవడానికి ప్రధాన కారణం వేట.శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో వాకిటా పోర్పోయిస్‌పై అధ్యయనం చేసిన పరిశోధకురాలు డాక్టర్ జాక్వెలిన్ రాబిన్సన్ మాట్లాడుతూ.మా అధ్యయనంలో మనం వాకిటా పోర్పోయిస్‌లను సేవ్ చేయవచ్చని స్పష్టంగా చెప్పారు.

అవివుంటున్న భూభాగం నుండి గిల్‌నెట్‌లను తీసివేస్తే వాటిని సంరక్షించవచ్చన్నారు.గిల్‌నెట్ అనేది భారీ వల.ఇందులో పెద్ద చేపలు పడతాయి.సైన్స్ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ఆధారంగా వాటి జనాభా కారణంగా మాత్రమే వాకిటా పోర్పోయిస్‌ అంతం కాబోతోందని డాక్టర్ జాక్వెలిన్ చెప్పారు.వాటిని ఎలాగైనా కాపాడుకోవాలి.వాకిటా పోర్పోయిస్‌కు జీవం పోయడానికి మనం అవకాశం ఇవ్వాలి.ఇలాచేస్తే మనం వాటి జనాభాను మళ్లీ పెంచవచ్చు.

అవివాటి జీన్స్‌లో జీవించగల పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.వాక్విటా పోర్పోయిస్ ఇంకా జన్యుపరంగా బలహీనపడలేదు.

అది అంతరించిపోకుండా ఉండగలదు.వారికి పూర్తి రక్షణ కల్పిస్తే వచ్చే 50 ఏళ్లలోపు దాని జనాభాను పెంచుకోవచ్చని డాక్టర్ జాక్వెలిన్ అన్నారు.

తాము 1985, 2017 మధ్య వాకిటా పోర్పోయిస్‌ల DNAలపై అధ్యయనం చేశాం.అవన్నీ ప్రస్తుతం ఉన్న 10 జాతుల DNAతో సరిపోలుతున్నాయి.

దీని తర్వాత వారి DNA ఆధారంగా వారి జీవితాన్ని లెక్కించాం.తద్వారా మంచి వాతావరణం ఉంటే 50 ఏళ్లలో తమ జనాభాను పెంచుకోవచ్చని తెలిసిందన్నారు.

ఈ జీవి చాలా అరుదు కాబట్టి ఇందులో జన్యు వైవిధ్యం తక్కువగా ఉంటుందని డాక్టర్ జాక్వెలిన్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube