గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా పేరుపొందిన రుమేసా గెల్గి.ఇప్పుడు మరో మూడు ప్రపంచ రికార్డులను నెలకొల్పారు.
టర్కీకి చెందిన ఆ మహిళ తన పేరిట ఐదు వరల్డ్ రికార్డులు కలిగి ఉండటంపై గర్విస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో చేపట్టిన వెరిఫికేషన్‌లో ఆమె పేరిట మరో మూడు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి.
ఈ భూమిపై ఇప్పుడు జీవించి ఉన్న మహిళ అతి పొడవైన చేతి వేలు (11.2 సెంటిమీటర్లు).అతి పెద్దదైన చేయి ఉన్న మహిళగా మరో రికార్డు తన పేరిట లిఖించుకుంది.ఆమె కుడి చేయి 24.93 సెంటిమీటర్ల పొడవు ఉన్నది.ఎడమ చేయి 24.26 సెంటిమీటర్లుగా ఉన్నది.అతి పొడవైన వీపు(బ్యాక్)గానూ ఆమె రికార్డు ఉన్నది.
గెల్గి జనవరి 1, 1997న జన్మించింది.కాగా ఈమె న్యాయవాది, పరిశోధకురాలు ఫ్రంట్-ఎండ్ డెవలపర్.
ఆమె అక్టోబర్ 2021 నుంచి గిన్నిస్ వరల్డ్ రికార్డులో అతి ఎత్తైన మహిళగా రికార్డు ఆమె పేరిట ఉన్నది.ప్రస్తుతం ఆమె ఎత్తు 215.16 సెంటిమీటర్లు ఉన్నట్టు తేలింది.అంటే 7.7 ఫీట్లు.
ఆమె మాట్లాడుతూ.
నేను చిన్నతనంలో చాలా వేధింపులకు గురయ్యాను, కానీ పొడవుగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ను అందుకోవడమే అన్నారు.

నేను యుక్తవయసులో 2014లో నా మొదటి రికార్డ్ టైటిల్‌ను అందుకున్నాను.ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డ్ ని అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ మరో మూడు గిన్నిస్ రికార్డులను బద్దలు కొట్టింది.
ఆమె వెరిఫికేషన్ తర్వాత గిన్నిస్ వరల్డ్ రికార్డు అకౌంట్ ఓ యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసింది.ఆ వీడియోలో గెల్గీ ఆమె జననం, ఆమె వ్యాధి, ఆమె గురించి ఎన్నో విషయాలను ఆ వీడియోలో రుమెసా గెల్గి వివరించారు.







