ప్రభాస్ లాటరీ స్టార్ అంటా.. ట్విట్టర్ లో అల్లు అర్జున్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ వార్!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాల్లో నటించి పాన్ ఇండియా స్టార్ లుగా మారుతున్నారు.

 Prabhas Is A Lottery Star Allu Arjun And Prabhas Fans War On Twitter, Prabhas, A-TeluguStop.com

ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతున్నారు.ఒక మహేష్ బాబు తప్ప మిగతా స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సక్సెస్ ను పొందారు.

అందులో మొదటగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో టాలీవుడ్ లో మొదట పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు.ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి గురించి అందరికీ పరిచయమే.టాప్ డైరెక్టర్లలో తాను ఒకడు.

తన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాకు మంచి సక్సెస్ అందుకున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలకే అలవాటు పడగా రాజమౌళి కూడా స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.

ఇటీవలే రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా తర్వాత మరో స్టార్ హీరోతో కూడా మరో పాన్ ఇండియా సినిమాను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాడు.

అలా రాజమౌళి ద్వారా ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు పాన్ ఇండియా హీరోలుగా మారారు.

Telugu Allu Arjun, Prabhas, Rajamouli, Sukumar, Telugu, Tollywood-Movie

నిజానికి రాజమౌళి దర్శకత్వంకు ఏ డైరెక్టర్ కూడా పోటీగా వచ్చినా అంతగా సక్సెస్ కాలేరు.కాని ఓ డైరెక్టర్ మాత్రం ఏకంగా పాన్ ఇండియా సినిమాను రూపొందించి తాను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా ఒక వెలుగు వెలుగుతున్నాడు.ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరో కాదు.

డైరెక్టర్ సుకుమార్.గత ఏడాది ఈయన దర్శకత్వంలో పుష్ప సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా ఈ సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారాడు.అల్లు అర్జున్ తో పాటు కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

దీంతో ఒక సామాన్య డైరెక్టర్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం సామాన్య విషయం కాదనే చెప్పాలి.ఎందుకంటే పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోయే సత్తా రాజమౌళి ఒక్కడికే ఉంటుంది.

Telugu Allu Arjun, Prabhas, Rajamouli, Sukumar, Telugu, Tollywood-Movie

కానీ తాజాగా రాజమౌళి ని ఉద్దేశించి ప్రభాస్ ను లాటరీ స్టార్ అంటూ అల్లు అర్జున్ అభిమానులు ట్విట్టర్ లో బాగా మాటల యుద్ధాలు చేస్తున్నారు.ప్రస్తుతం దానికి సంబంధించిన ఒక ట్రోలింగ్ పిక్ కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది.అందులో రాజమౌళి తో లాటరి స్టార్లుగా మారతారు అని.మామూలు డైరెక్టర్లతో పాన్ ఇండియా లెవల్లో స్టార్లు అవుతారు అని ఉండటంతో.అది చూసిన ఆ స్టార్ హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు బాగా ఫైర్ అవుతూ కనిపిస్తున్నారు.మరి ఈ వాదనలకు ఆ స్టార్ హీరోలు ఏమని స్పందిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube