కరోనా వచ్చింది ఇండియా గౌరవం పెరిగింది

మన భారతీయ సనాతన ధర్మంలో చెప్పిన మంచి విషయాలని ఇప్పటికి చాలా మంది విస్మరించారు.

అయితే పూర్వీకులు చెప్పిన ప్రతి విషయం వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

చాలా మంది వాటిని మూఢ విశ్వాసాలు అని కొట్టి పారేస్తున్న ప్రపంచ వ్యాప్తంగా వాటి ప్రాధాన్యత ఏంటి అనేది ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే ఉంది.ఇండియాలో అత్యంత గొప్పగా, ముఖ్యంగా మహిళలు పసుపుని ముఖానికి రాసుకుంటారు.

దీనిని మన ఇండియా మహిళలు వదిలేసినా కార్పోరేట్ వాళ్ళు గ్రహించి పసుపుని ఉపయోగించి సౌందర్య ఉత్పత్తులు తయారు చేసుకొని వాటిని ప్రమోట్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా షేక్ హ్యాండ్ సంస్కృతి ఉంటే ఇండియాలో మాత్రమే నమస్కారం అనే పద్ధతి ఇప్పటికి ఉంటుంది.

పెద్దలుగా నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని చెబుతారు.విదేశాలలో షేక్ హ్యాండ్, హగ్గింగ్, కిస్సింగ్ అనే పద్దతులని ప్రాధాన్యత బట్టి వాడుతారు.

Advertisement

అయితే ఇప్పుడు కరోనా ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాలలో వ్యాపించింది.షేక్ హ్యాండ్, హగ్గింగ్ వలన కరోనా చాలా వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు నిర్దారించడం ఇప్పుడు అందరూ నమస్కారం అనే పద్ధతిని ఫాలో అవుతున్నారు.

ఇండియన్స్ వాడే ఈ గౌరవ నమస్కారం ప్రాధాన్యత ఏంటో ఇప్పటికి గ్రహించారు.తాజాగా ఈ విషయం మీద ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యహు ట్వీట్ లో ఇండియా గౌరవ సూచకంగా వాడే నమస్కారం అందరూ అలవాటు చేసుకోవాలని దీని ద్వారా కరోనా నుంచి బయటపడోచ్చని చెబుతున్నారు.

అలాగే విదేశాలలో చాలా మంది ప్రముఖులు నమస్కారం సింబల్ ని ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు.

ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !
Advertisement

తాజా వార్తలు